E-Paper
Advertisement

Nari Nari Naduma Murari Trailer: ఎంటర్టైనింగ్ గా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ట్రైలర్..

Nari Nari Naduma Murari Trailer: ఎంటర్టైనింగ్ గా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ట్రైలర్..
Advertisement

Nari Nari Naduma Murari Trailer: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త మీనన్(Samyuktha Memon), సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari). ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే జనవరి 14న ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇలా ఈ సినిమా విడుదలకు రెండు రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

వినోదాత్మకంగా ట్రైలర్..

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.2:32 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను అల్లరిస్తుందని చెప్పాలి. ఈ ట్రైలర్ వీడియో ఎంటర్టైనింగ్ గా ఉండడంతో సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మాజీ ప్రేయసి ప్రస్తుత ప్రేయసి మధ్య నలిగిపోయే యువకుడి పాత్రలో శర్వానంద్ నటన అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక ఈ టైలర్ వీడియోలో సత్య, సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, వంటి వారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

బాలయ్య సినిమా టైటిల్..

Advertisement

ఇక ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విడుదలకు సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారు. మరోవైపు హీరో హీరోయిన్లు వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో శర్వానంద్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి అనే సినిమా ద్వారా సంక్రాంతి బరిలో దిగారు.

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి సంక్రాంతి రేసులో దిగుతున్న శర్వానంద్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా శర్వానంద్ స్టార్ హీరోలతో పాటు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమాలో మరొక హీరో శ్రీ విష్ణు క్యామియో పాత్రలో సందడి చేయబోతున్నారు.

Also Read; Dasari Narayanarao: ఆ స్టార్ హీరోతో దాసరి కల్కి సినిమా చేయాలనుకున్నారా.. ఎవరంటే?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×