E-Paper
Advertisement

Nakka Indaiah: చావును పండుగలా ఆహ్వానించాడు: 15 ఏళ్ల ముందే ‘శాశ్వత గృహం’ కట్టుకున్న ఇందయ్య.. అరుదైన వీడ్కోలు!

Nakka Indaiah: చావును పండుగలా ఆహ్వానించాడు: 15 ఏళ్ల ముందే ‘శాశ్వత గృహం’ కట్టుకున్న ఇందయ్య.. అరుదైన వీడ్కోలు!
Advertisement

Nakka Indaiah: జగిత్యాల జిల్లాలో వెలుగుచూసిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆలోచనకు గురిచేస్తోంది. మరణం అనేది ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడుతుందని తెలిసినా, దాని కోసం ఒక పండుగలా సిద్ధపడిన వ్యక్తి నక్క ఇందయ్య (అలియాస్ జాన్). తన అంతిమ యాత్ర ఎవరికీ భారం కాకూడదని భావించి, 15 ఏళ్ల ముందే తన ‘శాశ్వత గృహాన్ని’ నిర్మించుకున్న ఆయన జీవన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

ఇందయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలై స్థిరపడ్డారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య, కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తండ్రి మరణవార్తతో కుటుంబం శోకసముద్రంలో మునిగినా, ఆయన ఆఖరి కోరికను గౌరవించాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల క్రితం ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ రాతి సమాధి వద్దే ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇందయ్య పెద్దగా చదువుకోలేదు. కానీ, ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం అసాధారణమైనది. పొట్టకూటి కోసం సాధారణ కార్మికుడిగా దుబాయ్ వెళ్లిన ఆయన, అక్కడ కేవలం కూలి పనులకే పరిమితం కాలేదు. తన కష్టార్జితంతో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి, ఎంతోమందికి ఉపాధి కల్పించి అన్నం పెట్టాడు. విదేశాల్లో సంపాదించిన తర్వాత తిరిగి తన సొంత గ్రామానికి వచ్చి, అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరి మన్ననలు పొందారు.

ఇందయ్య ఆలోచనలు లోకానికి చాలా భిన్నంగా ఉండేవి. మరణం తర్వాత తన పిల్లలు ఆరడుగుల నేల కోసం వెతకకూడదని, తన అంత్యక్రియల ఖర్చు ఎవరికీ భారం కాకూడదని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే 2009లో సుమారు రూ. 8 లక్షల భారీ ఖర్చుతో గ్రామ శివారులోని తన సొంత భూమిలో ఒక పటిష్టమైన రాతి సమాధిని నిర్మించుకున్నాడు. అంతటితో ఆగకుండా, ప్రతిరోజూ ఆ సమాధి వద్దకు వెళ్లి కాసేపు గడిపేవాడు. “నేను చనిపోయాక నన్ను ఇక్కడే నిద్రపుచ్చాలి” అని తన కుటుంబ సభ్యులకు ఎప్పుడో వీలునామా రాసిపెట్టాడు.

Advertisement

చదువు లేకపోయినా బతుకులోని అసలైన సత్యాన్ని ఇందయ్య ఒంటబట్టించుకున్నారని గ్రామస్థులు కొనియాడుతున్నారు. మరణాన్ని ఒక భయంలా కాకుండా, జీవితంలో అది కూడా ఒక భాగమని నమ్మి, తన అంతిమ యాత్రను కూడా ఒక క్రమశిక్షణతో ప్లాన్ చేసుకున్న ఇందయ్య కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. తేదీ, సమయం ఇదే?

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×