E-Paper
Advertisement

Sharwanand: మోసపోయాను..మీ ఇష్టం వచ్చింది రాసుకోండి … శర్వా కామెంట్స్ విడాకుల గురించేనా?

Sharwanand: మోసపోయాను..మీ ఇష్టం వచ్చింది రాసుకోండి … శర్వా కామెంట్స్ విడాకుల గురించేనా?
Advertisement

Sharwanand: శర్వానంద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో శర్వానంద్ (Sharwanand) నటించి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈయన సక్సెస్ సినిమా చూసి కూడా చాలా కాలం అవుతుంది. ఇక త్వరలోనే శర్వానంద్ బైకర్ (Biker)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

జీవితంలో దేనికి భయపడకూడదు..

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శర్వానంద్ ఇటీవల ఒక కాలేజీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఇలా విద్యార్థులను ఉద్దేశించి ఈయన జీవితం గురించి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఈయన పరోక్షంగా తన విడాకుల (Divorce)గురించే మాట్లాడారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. జీవితంలో దేనికి భయపడకూడదని ధైర్యంగా ముందడుగు వేయాలని తెలిపారు.

నీ జీవితం నీ ఇష్టం..

Advertisement

నేను కూడా నా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను ఎన్నోసార్లు ఓడిపోయాను, కింద పడిపోయాను.. మోసపోయాను.. ఇలా పడిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నానని తెలియచేశారు. బుక్కు నీది, పెన్ను నీది, స్టోరీ నీది.. నీ స్టోరీని నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో అంటూ ఈయన మన జీవితాన్ని మనకు నచ్చినట్టు బ్రతకాలని తెలియజేశారు. ఇలా శర్వానంద్ మోసపోయాను, ఓడిపోయాను అంటూ మాట్లాడటంతో ఈయన విడాకుల గురించి ఇలా మాట్లాడారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

శర్వానంద్ రెండు సంవత్సరాల క్రితం రక్షిత రెడ్డి(Rakshitha Reddy) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఉదయపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా సాఫ్ట్ వేర్ ను పెళ్లి చేసుకున్న శర్వానంద్ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది అయితే పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరుగా ఉంటున్నారని, విడాకులు కూడా తీసుకున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఈ విడాకుల వార్తలపై శర్వానంద్ ఎక్కడ స్పందించలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఫిట్ గా ఉండటానికి కారణం తన కుమార్తె అని తన కోసం తన కుటుంబ క్షేమం కోసం నన్ను నేను మార్చుకున్నానని చెప్పడంతో విడాకుల వార్తలు అవాస్తవమేనని అందరూ భావించారు. కానీ తాజాగా శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే వీరి విడాకుల గురించి వచ్చే వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ విడాకుల వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారకంగా ఈ విషయంపై స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: Big tv Kissik Talks: ఆ నటుడితో జ్యోతి రెండో పెళ్లి… ఖచ్చితంగా చేసుకుంటానంటూ?

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×