E-Paper
Advertisement

ఎవరేమనుకున్నా పర్లేదు.. ప్రభాస్ అన్న మీరు నా హార్ట్ లో ఉన్నారు: శర్వానంద్

ఎవరేమనుకున్నా పర్లేదు.. ప్రభాస్ అన్న మీరు నా హార్ట్ లో ఉన్నారు: శర్వానంద్
Advertisement

Sharwanand: శర్వానంద్ తాజాగా బైకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే కేవలం 3 నెలల వ్యవధిలో ఈయన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు. రేసింగ్ నేపథ్యంలో అభిలాష రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బైకర్. ఈ సినిమాలో శర్వానంద్ రేసర్ గా కనిపించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్
కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రభాస్ అన్న లవ్ యూ…

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. అయితే శర్వానంద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముందుగా ప్రభాస్(Prabhas) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. బైకర్ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడం వెనుక ప్రభాస్ ప్రమేయం ఉందని తెలిపారు. ముందుగా ప్రభాస్ అన్నకు చాలా స్పెషల్ థాంక్స్.. లవ్ యు అన్న.. ఎవరేమనుకున్నా మీరు నా హార్ట్ లో ఇక్కడ ఉన్నారు అంటూ ప్రభాస్ పై తనకున్నటువంటి గౌరవాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రభాస్ ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే.

బైకర్ కోసం ప్రభాస్ ప్రమోషన్స్..

Advertisement

ఇలా శర్వానంద్ సినిమా కోసం ఎప్పటికప్పుడు ప్రభాస్ పోస్టులు చేస్తూ ఈ సినిమాకు కావలసినంత బజ్ అందించారు. అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక చిన్న వీడియోని కూడా ప్రభాస్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటూ ప్రభాస్ ఒక వీడియోని వదలడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయి సినిమాకు కావలసినంత ప్రమోషన్ ని ఇచ్చింది. ఇలా ఈ సినిమా సక్సెస్ లో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో శర్వానంద్ సభా వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సినిమాను ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు..

చెప్పి మరి హిట్టు కొట్టిన శర్వానంద్..

Advertisement

తాను నారి నారి నడుమ మురారి సినిమాకు ముందు కూడా ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని చెప్పి మరీ హీట్ కొట్టాను. మొన్న కూడా బ్లాక్ బస్టర్ ఇస్తానని చెప్పాను. చెప్పిన విధంగానే బైకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నామని శర్వానంద్ తెలిపారు. అయితే ఈ సినిమా ఇంత మంచిగా మీ ముందుకు రావడానికి నిర్మాత వంశీ మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అని శర్వానంద్ తెలిపారు. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తానని ఈయన తెలిపారు. ఇందులో శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్ నటించగా,ఆయన గురించి మాట్లాడుతూ పట్ల ప్రశంసలు కురిపించారు. రాజశేఖర్ లాంటి గారితో కలిసి సినిమా షేర్ చేసుకోవడం తన అదృష్టం అని శర్వానంద్ ఈ సందర్భంగా తెలిపారు.

Also Read: శర్వానంద్ బైకర్ సినిమాలో నటించి ఫీలయ్యాను.. రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×