E-Paper
Advertisement

తెలంగాణ పోలీసుల జైత్రయాత్ర.. జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో హ్యాట్రిక్ విజయం!

తెలంగాణ పోలీసుల జైత్రయాత్ర.. జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో హ్యాట్రిక్ విజయం!
Advertisement

Telangana Police Overall Champion: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం జాతీయ స్థాయిలో మరోసారి తన ఘనతను చాటుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన 69వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో తెలంగాణ పోలీస్ బృందం ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచి అద్భుతమైన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం విశేషం. గత మూడేళ్లుగా అంటే 2024లో లక్నో, 2025లో రాంచీ, ఇప్పుడు 2026లో నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో వరుసగా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణ పోలీసులు తమ వృత్తి నైపుణ్యాన్ని జాతీయ స్థాయిలో నిరూపించారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన పోలీసు బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సీఐడీ (CID) పర్యవేక్షణలో నిరంతరం సాగిన కఠిన శిక్షణే ఈ అద్భుత ప్రదర్శనకు ప్రధాన కారణమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ చారు సిన్హాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, వృత్తిపరమైన క్రమశిక్షణకు ఈ ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీ ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో తెలంగాణ పోలీస్ విభాగం ముందు వరుసలో ఉందని ఈ విజయ పరంపర స్పష్టం చేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ పోలీసులు కేవలం ఓవరాల్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా పలు కీలక విభాగాల్లో తమ ముద్ర వేశారు. యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ మరియు కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతగా నిలిచి సత్తా చాటారు. అలాగే శాస్త్రీయ దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ వంటి విభాగాల్లో రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నేర పరిశోధన చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మేటి అని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.

Advertisement

Read Also: వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×