E-Paper
Advertisement

Biker Movie Postpone : బైకర్ మూవీపై బయ్యర్ల ఒత్తిడి.. వాయిదా వేసుకున్న నిర్మాతలు..

Biker Movie Postpone : బైకర్ మూవీపై బయ్యర్ల ఒత్తిడి.. వాయిదా వేసుకున్న నిర్మాతలు..
Advertisement

Biker Movie Postpone : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బైకర్.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బాలయ్య నటిస్తున్న అఖండ 2 అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో బైకర్ మూవీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అఖండ 2తో పోటీ అంటే ఆషామాషీ కాదు. పాజిటివ్ టాక్ వస్తే బాలయ్య చేసే బాక్సాఫీస్ రచ్చ మాములుగా ఉండదు. ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి లేదు.అందుకే బైకర్ మూవీని వెనక్కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో ఒకసారి తెలుసుకుందాం..

‘బైకర్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే..

యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం నటిస్తున్న సినిమా బైకర్.. బైక్ ఛేజ్ స్పోర్ట్స్ డ్రామాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శర్వానంద్ దీని కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే బిగ్గెస్ట్ ని కొట్టాలని హీరో గట్టిగానే ఫిక్స్ అయ్యాడు.. దాంతో పాటుగా ఆయన బరువు కూడా తగ్గాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ని అందించాయి. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఎలాగైనా సరే బైకర్ మూవీతో హిట్ కొట్టాలని శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. బాలయ్య కోసమే ఈ మూవీ వెనక్కి వెళ్ళింది.. డిసెంబర్ 6 న రిలీజ్ కావాల్సిన బైకర్ డిసెంబర్ 19 న థియేటర్లలోకి రానుందని టాక్.. త్వరలోనే ఈ రిలీజ్ ను మేకర్స్ అనౌన్స్ చెయ్యనున్నారు.

Advertisement

Also Read :బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు.. ఇదేం ట్విస్ట్ బాసూ..

బయ్యర్ల ఒత్తిడి వల్లే పోస్ట్ పోన్ అయ్యిందా..? 

బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీస్ అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కాంబోలో అఖండ 2 మూవీ రాబోతుంది. అఖండ కు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. ఈ మూవీ కోసం నందమూరి అభిమానులతో పాటుగా సినీ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. బాలయ్య సినిమాతో పోటీ పడడం అంటే మామూలు విషయం కాదు. హిట్ కొట్టాలన్న కసితో ఉన్న శర్వానంద్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారం తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అదే విధంగా బాలయ్య మూవీకి పోటీగా అంటే కష్టం అని చిత్ర యూనిట్ కు బయ్యర్ల ఒత్తిడి ఎక్కువ అవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా కూడా వెనక్కి తగ్గి మంచి పని చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ డేట్ ఏ మాత్రం కాసులను కురిపిస్తుందో చూడాలి.. ఇక ఈ మూవీ తర్వాత సంక్రాంతి కానుకగా శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×