E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu :బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు.. ఇదేం ట్విస్ట్ బాసూ..

Bigg Boss 9 Telugu :బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు.. ఇదేం ట్విస్ట్ బాసూ..

Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారని ఆడియన్స్ ఆసక్తిగా ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూసేస్తున్నారు. దాంతో ఈ షో టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెరిగిందని తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కొందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ ఎంట్రీ తర్వాత హౌస్ లో గొడవలు టాస్కులు పెరిగిపోయాయి. అయితే మరికొద్ది రోజుల్లో ఈ షో కే శుభం కార్డు పడబోతుంది.. ఈ క్రమంలో షో  పై బజ్ ను క్రియేట్ చేసేందుకు హౌస్ లోకి పాత కంటెస్టంట్స్ ను హౌస్ లోకి తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే కొందరు వచ్చి ఎంటర్టైన్ చేశారు.. ఇప్పుడు ఏకంగా సీరియల్ నటుడు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి తెలుసుకుందాం..

బిగ్ బాస్ లోకి గుండెనిండా గుడిగంటలు బాలు..

బిగ్ బాస్ స్టేజ్ మీదకు సినిమాల ప్రమోషన్స్ కోసం సినిమా వాళ్లు వస్తుంటారు. ఇప్పటికే ఎంతోమంది తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ వీక్ లో సందర్భంగా పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ కొచ్చి కంటెస్టెంట్లకు బూస్ట్ ఇచ్చారు. అయితే తాజాగా  స్టార్ మా లో సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని హీరో బాలు బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించడంతో అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారేమో అని కామెంట్లు పెడుతున్నారు.. బాలు అలియాస్ విష్ణు కాంత్ బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జునతో కలిసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో విష్ణు కాంత్ తన తల్లిదండ్రులను నాగార్జునకు పరిచయం చేస్తున్నాడు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మాస్ జాతర ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బిగ్ బాస్ 12 వ వారం నామినేషన్స్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 11 వారాలను పూర్తి చేసుకుంది. అయితే గత వారం నో ఎలిమినేషన్ ప్రకటించారు. దాంతో హౌస్ లోని వాళ్లు సేఫ్ అయ్యారు.. అయితే 12 వరం నామినేషన్స్ రసవత్రంగా మారింది. ఈవారం నామినేషన్ లో రీతూ తప్ప మిగిలిన వాళ్లు అందరు నామినేట్ అయ్యారు. గతవారం డేంజర్ లో ఉన్న సంజన, దివ్య ఈవారం కూడా డేంజర్ లోనే కొనసాగుతున్నారు. మరి 12వ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అదే గనక జరిగితే సంజన దివ్య ఇద్దరు ఒకేసారి బయటకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అటు సోషల్ మీడియాలో ఈ సీజన్ విన్నర్ గా పవన్ ఉండబోతున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఎవరు హౌస్ విన్నర్ అవుతారో చూడాలి..

?igsh=MWQ2djY4dTRid2pw

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×