E-Paper
Advertisement

Varanasi: వారణాసి సినిమా డ్యూరేషన్ ఇదే, అలాంటివి ఏమీ ఉండవు

Varanasi: వారణాసి సినిమా డ్యూరేషన్ ఇదే, అలాంటివి ఏమీ ఉండవు
Advertisement

Varanasi: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ సినిమా వారణాసి అప్డేట్ ఇచ్చారు. సినిమా టైటిల్ కూడా వారణాసి అని ఒక అతిపెద్ద ఈవెంట్ తో రివీల్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఇదే టైటిల్ పెడుతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి. దాని గురించి టీం ఏ రోజు స్పందించలేదు.

కొన్ని సినిమాలు మొదలుపెట్టేముందు కథ ఎలా ఉండబోతుందో అనే క్లారిటీ రాజమౌళి చాలా సందర్భాల్లో ఇచ్చేశారు. బాహుబలి సినిమాకు చెప్పలేదు కానీ ఈగ మర్యాద రామన్న వంటి సినిమాలకు కథను ముందే చెప్పేసాడు. అలా కథను ముందే చెప్పేయటం వలన ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా ఆడియోస్ థియేటర్ కు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళని సర్ప్రైజ్ చేశాడు రాజమౌళి.

Advertisement

ఇక వారణాసి సినిమాకి సంబంధించి ఏ మాత్రం కథను చెప్పకుండా ఆ వరల్డ్ ఎలా ఉండబోతుందో అని మూడు నిమిషాల పాటు సాగే ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో చూస్తుంటే రాజమౌళి పెద్దగానే ఏదో డిజైన్ చేశాడు అని క్లారిటీగా అర్థమయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.

డ్యూరేషన్ ఇదే 

వారణాసి ప్రస్తుతం 200 నిమిషాలు+ (3 గంటలు 20 నిమిషాలు+) రన్‌టైమ్‌తో ప్లాన్ చేయబడింది. పూర్తి కథ మరియు టైమ్ (రామాయణం పురాతన కాలం / వర్తమానం) ఈ వ్యవధిలో సరిపోతాయని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. చిత్రంలోని ప్రతి ఎపిసోడ్ వరుసగా మరియు క్లారిటీగా తెరకెక్కించబడుతుంది. అలానే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

మహేష్‌బాబు, పృథ్వీరాజ్ లేదా ప్రియాంకచోప్రా కోసం సాధారణ రాజమౌళి తరహా ఇంట్రడక్షన్స్ ఉండవు. మొదటి ఫ్రేమ్ నుండి, సినిమా డైరెక్ట్ గా కథలోకి ఎంటర్ అయిపోతుంది. ఎక్కువగా ఎలివేషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలుస్తుంది.

సాధ్యమవుతుందా? 

మూడు గంటలు 20 నిమిషాలు అంటే మామూలు విషయమే. అనిమల్, రంగస్థలం వంటి సినిమాలు కూడా దాదాపు మూడు గంటలపాటు ఉంటాయి. అయితే వారణాసి సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో అని ఎస్టాబ్లిష్ చేసిన వీడియో చూస్తుంటే అందరికీ మతిపోయింది.

చాలా కంటెంట్ రాజమౌళి ఆ సినిమాతో చెబుతున్నాడు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. కేవలం మూడు గంటలు 20 నిమిషాల్లో అంత పెద్ద కంటెంట్ చెప్పగలుగుతాడా? అది సాధ్యమవుతుందా అని కొత్తగా ఆలోచనలు మొదలవుతున్నాయి. ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: Sharwanand : నన్ను జీవితంలో చాలా మంది మోసం చేశారు

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×