E-Paper
Advertisement

Shekar Basha : అనసూయ, చిన్మయిల పై శేఖర్ బాషా ఫైర్… డబ్బులకోసమే ఇదంతా..పరువు తీసేశాడు..

Shekar Basha : అనసూయ, చిన్మయిల పై శేఖర్ బాషా ఫైర్… డబ్బులకోసమే ఇదంతా..పరువు తీసేశాడు..
Advertisement

Shekar Basha : దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా మారాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మహిళల దుస్తుల గురించి మాట్లాడిన తీరు కొందరి మనసు నొచ్చుకుందని తెలుస్తుంది. శివాజీ వ్యాఖ్యలపై చిన్మయి, అనసూయ స్పందిస్తూ మహిళా హక్కులపై మాట్లాడగా, విమర్శలు పెరగడంతో శివాజీ క్షమాపణ చెప్పారు.. అయినా కూడా ఈ వ్యాఖ్యలపై విమర్శలు తగ్గలేదు. శివాజీ ముమ్మాటికీ చేసింది తప్పే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివాజీ అన్న మాటల్లో తప్ప ఏమీ లేదు మనం పద్ధతిగా ఉండాలని అన్నారు అని ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.. తాజాగా ఈ వివాదంపై సినీ నటుడు ఆర్జే శేఖర్ బాషా తనదైన స్టైల్ లో స్పందించారు.. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై ప్రస్తావించారు. శేఖర్ బాషా రెచ్చిపోయాడు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

అనసూయ, చిన్మయికి శేఖర్ బాషా వార్నింగ్.. 

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణ పై వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు సామాన్లు కనిపించకుండా చీరలతో పద్ధతిగా కప్పుకోవాలని ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా మారాయి.. మంచి ఉద్దేశంతో శివాజీ చెప్పిన సరే దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చుకొని ఆయన పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీలు శివాజీకి మద్దతు తెలుపుతున్నారు.. మరికొందరు మాత్రం మా ఒళ్ళు మా ఇష్టం అంటూ పోస్టులు, వీడియోలు పెడుతూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా దీనిపై స్పందించారు.. ఆయన లైవ్ చర్చలో ఉండగా దీని ప్రస్తావన వచ్చింది. గతంలో ఇండస్ట్రీ పెద్దలు మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు వారిద్దరికీ ఉందా అని నిలదీశారు. వీళ్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కాలేదు అని ఆయన లైవ్ లో కడిగిపడేసాడు. ప్రస్తుతం ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also Read : రాజమౌళి సినిమాలో అభిజిత్.. ఇదేం ట్విస్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

బూతు పాటలు పాడటం తప్పులేదా..

సింగర్ చిన్మయి శ్రీపాద గతంలో పాడిన పాటల గురించి ఈ ఇంటర్వ్యూలో శేఖర్ బాషా ప్రస్తావించారు.. ఆమె పాడిన రోబో మూవీలోని కిల్లిమంజారో పాటలోని నా సోకు పళ్ళను తిని అని వచ్చిన లైన్ పై చర్చించారు. ఇలాంటి పదాలను పలికినప్పుడు అసభ్యంగా అనిపించలేదా? అటు అనసూయ జబర్దస్త్ లో ఎన్నిసార్లు బూతు మాటలు మాట్లాడింది. ఇవన్నీ వీళ్లు మాట్లాడితే తప్పు కాదా..? ఇలాంటి పనులు చేసిన వీళ్లకు మాట్లాడే అధికారం లేదు అని శేఖర్ భాష లైవ్ లోనే ఇద్దరి పరువు తీసేసాడు. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు శేఖర్ బాషా కు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. మరి శేఖర్ బాషా వ్యాఖ్యల పై అనసూయ, చిన్మయి ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వివాదం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరి ఇంకెన్ని గొడవలు పుట్టుకోస్తాయో చూడాలి..

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×