Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో పెంచుకునే మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు.. ఇంటి ఆర్థిక పరిస్థితిని, కుటుంబ సభ్యుల మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా అరటి చెట్టును సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు స్వరూపంగా.. దేవ గురువు బృహస్పతికి నిలయంగా భావిస్తారు. అందుకే ఇంట్లో అరటి చెట్టు ఉండటం శుభసూచకం. అయితే.. దీనిని సరైన దిశలో నాటక పోతే తీవ్రమైన వాస్తు దోషాలు కలుగుతాయి. అరటి చెట్టును ఏ దిశలో పెట్టకూడదు. పెడితే ఎలాంటి నష్టాలు వస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దిశలో అరటి చెట్టును అస్సలు నాటకూడదు:
వాస్తు శాస్త్రం ప్రకారం, అరటి చెట్టును ఎప్పుడూ దక్షిణ దిశ లేదా పడమర దిశలో నాటకూడదు. అలాగే ఇంటికి నైరుతి మూలలో కూడా ఈ చెట్టు ఉండటం ఏమాత్రం మంచిది కాదు.
ఈ దిశలలో అరటి చెట్టు ఉండటం వల్ల కలిగే నష్టాలు:
ఆర్థిక ఇబ్బందులు: దక్షిణ దిశలో అరటి చెట్టు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి.. అప్పుల పాలయ్యే ప్రమాదం ఉంది.
అశాంతి: కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు రావడం, మనశ్శాంతి కరువవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్య సమస్యలు: ఇంటి యజమాని లేదా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ దిశలో నాటడం శ్రేయస్కరం ?
అరటి చెట్టును ఎప్పుడూ ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలలో నాటాలి. ముఖ్యంగా ఈశాన్య మూల అరటి చెట్టుకు అత్యంత శుభప్రదమైన స్థానం. ఈ దిశలో నాటడం వల్ల గురు గ్రహ అనుగ్రహం లభించి, ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీని వల్ల ఐశ్వర్యం పెరగడమే కాకుండా.. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది.
అరటి చెట్టు విషయంలో పాటించాల్సిన ఇతర వాస్తు నియమాలు:
ప్రధాన ద్వారం వద్ద వద్దు: ఇంటి ప్రధాన తలుపుకు సరిగ్గా ఎదురుగా అరటి చెట్టు ఉండకూడదు. ఇది ఇంటికి వచ్చే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది.
తులసి మొక్కతో కలిపి: అరటి చెట్టు దగ్గర తులసి మొక్కను పెంచడం చాలా మంచిది. విష్ణువుకు అరటి చెట్టు, లక్ష్మీదేవికి తులసి ప్రీతిపాత్రమైనవి కాబట్టి.. ఈ రెండూ కలిసి ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.
Also Read: మీ ఇంట్లో సంపద పెరగాలా ? కొత్త సంవత్సరం వేళ ఇవి తప్పక కొనండి
శుభ్రత ముఖ్యం: చెట్టు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించాలి. ఎండిపోయిన అరటి చెట్టు ఇంట్లో ఉండటం దారిద్య్రానికి హేతువు.
స్నానం తర్వాత నీరు: ప్రతి గురువారం అరటి చెట్టుకు పసుపు కలిపిన నీటిని పోసి, నెయ్యి దీపం వెలిగిస్తే.. పెళ్లికాని వారికి వివాహ యోగం పడుతుంది.
అరటి చెట్టు దేవతా వృక్షం కాబట్టి దానిని గౌరవప్రదమైన స్థానంలో ఉంచాలి. పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటించి సరైన దిశలో మొక్కను నాటితే.. ఆ పచ్చని చెట్టు మీ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో తప్పుడు దిశలో చెట్టు ఉంటే.. దానిని తొలగించి ఈశాన్యంలో కొత్త మొక్కను నాటడం మంచిది.