E-Paper
Advertisement

Dhandoraa Teaser: చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద..అదిరిపోయిన దండోరా టీజర్

Dhandoraa Teaser: చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద..అదిరిపోయిన దండోరా టీజర్
Advertisement

Dhandoraa Teaser: చిన్న చిన్న సినిమాలు.. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు ప్రస్తుతం ఇండస్ట్రీని నడిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఏది ట్రెండ్ లో ఉంటే దాని వైపే మేకర్స్ మొగ్గు చూపిస్తూ ఉంటారు. బలగం తరువాత విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు ఎక్కువగా వస్తున్నాయి. మన తెలంగాణ సాంప్రదాయాలు, యాస, భాషా..  ఆ విధానాలు అన్ని ఎంతో చక్కగా చూపిస్తున్నారు. తాజాగా అలాంటి కథతోనే వస్తుంది దండోరా. నవదీప్, నందు, శివాజీ, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న చిత్రం దండోరా. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా దండోరా టీజర్ ను అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

దండోరా టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఒకరు హీరో.. ఒకరు విలన్ అనేది ఏమి లేదు. అందరూ హీరోలే అన్నట్లు చూపించారు. ఒక పల్లెటూరు.. సర్పంచ్ గా నవదీప్.. పెద్ద మనిషిగా శివాజీ.. కాలేజ్ కుర్రాడిగా రవికృష్ణ.. పట్నం నుంచి వచ్చిన జంటగా నందు, మౌనికా రెడ్డి కనిపించగా.. ఊర్లో ఉండే వేశ్యగా బిందు మాధవి కనిపించింది. ప్రతి పాత్రకు ఒక కథ ఉంది. శివాజీ పాత్ర మరింత హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది.

Advertisement

కథ మొత్తాన్ని అంతగా చూపించలేదు కానీ.. ఊర్లో ఉండే ఆచారాలు.. గొడవలు.. ప్రేమలు అన్నింటిని చూపించారు. సినిమా అంతా ఒక చావు చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒక వ్యక్తి చనిపోతాడు. అతనిని చూడడానికి అందరూ వస్తారు.కానీ, అతనిని ఊరి బయట స్మశానంలో కాకుండా.. ఎవరూ ముట్టుకోకుండా.. కనీసం చితి కూడా అంటించకుండా.. వంతెన నుంచి కిందకు పడేయడం చూపించారు. అసలు చనిపోయింది ఎవరు.. ? ఎందుకు అలా చేశారు.. ? ఆ చావుకు ఈ పాత్రలకు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

డైలాగ్స్ చాలా బావున్నాయి. ముఖ్యంగా చావు గురించి శివాజీ చెప్పే డైలాగ్ సినిమాకే హైలైట్ గా మారుతుంది అని చెప్పొచ్చు. చావు అనేది మనిషికిచ్చే ఆఖరి మర్యాద, నాలుగు పుస్తకాలు చదివి అంతా నాకే తెలుసు అనుకుంటున్నావు.. నీకు తెలియనిది చాలా ఉంది ఈడ అనే డైలాగ్స్ అయితే ఆలోచించేలా ఉన్నాయి. ఇక మార్క్ కె రాబిన్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. డిసెంబర్ 25 న దండోరా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో  శివాజీ, నవదీప్, నందు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Advertisement

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×