E-Paper
Advertisement

Telangana MLAs Defection case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Telangana MLAs Defection case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement

Telangana MLAs Defection case: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పీకర్‌ను ఆదేశించింది.  ఎమ్మెల్యేల విచారణకు 8 వారాల సమయం కావాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది స్పీకర్ కార్యాలయం.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు కొత్త మలుపు

Advertisement

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోక‌పోవడంపై సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కోర్టు దిక్కారం కిందకి వస్తుందని తెలిపింది సుప్రీంకోర్టు. ఈ కేసును తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో గడువు ఇచ్చిన మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై తెలంగాణ స్పీకర్ నుంచి వివరణ కోరింది న్యాయస్థానం. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు మీరు తీసుకుంటురా? తాము తీసుకోవాలా? అంటూ ప్రశ్నించింది.

Advertisement

తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. మూడు నెలలు సమయం ఇచ్చింది. ఈ వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ దిక్కార పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. స్పీకర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇకపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు. తమకు 8 వారాలు గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం పిటిషన్ దాఖలు చేసింది.

న్యాయస్థానం తీర్పుపై బీఆర్ఎస్ తరపున అడ్వకేట్ మీడియాతో మాట్లాడారు. వారం లోపల డిసైడ్ చేయాలని చెప్పినట్టు ఆయన తెలిపారు. కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసిందన్నారు. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పందించలేదని వివరించినట్టు తెలిపారు.

ALSO READ:  బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

మా వెర్షన్ మేము చెప్పామని, విచారణ డిలే చేస్తే వేటు వేయవచ్చని అన్నారు. వారంలో పూర్తి చేస్తే ఓకేనని, లేకుంటే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. గతంలో కొన్ని కేసుల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే 10 స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశముందని అంటున్నారు సదరు లాయర్.

Related News

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

Big Stories

Advertisement
×