E-Paper
Advertisement

Rajamouli: పైరసీ వల్ల మాకంటే ఎక్కువగా మీకే నష్టం..రాజమౌళి

Rajamouli: పైరసీ వల్ల మాకంటే ఎక్కువగా మీకే నష్టం..రాజమౌళి

Rajamouli: ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)అరెస్టు కావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు దర్శక నిర్మాతలు హీరోలు నేడు సజ్జనార్ (Sajjanar)తో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి కూడా మూవీ పైరసీ(Movie Piracy) గురించి మాట్లాడుతూ .. పైరసీ సినిమాలు చేసేవారు సంఘ సేవ చేయట్లేదు.. దీని వెనుక కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బంతా వాళ్లకు సొంతం కాదని, మీ డబ్బులనే వాళ్ళకి ఇచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడేలా చేస్తున్నారని రాజమౌళి తెలిపారు.

సైబర్ నేరాలకు అవకాశం..

ఇలా సినిమాని ఎవరైతే పైరసీలో చూస్తున్నారో వారందరి డేటా కూడా పైరసీకి పాల్పడుతున్న వారి దగ్గర ఉందని, ఇలా మీ బయోడేటా ద్వారా పెద్ద ఎత్తున సైబర్ మోసాలకు పాల్పడటంతో చాలామంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇలా సినిమా పైరసీలో చూడటం వల్ల మాకంటే ఎక్కువగా మీరే నష్టపోతున్నారని తెలిపారు. మనం సినిమాలను పైరసీలో చూడటం కోసం ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మన డేటా మొత్తం వారి దగ్గర ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఎప్పుడైతే మన డేటా వారి చెంతకు వెళ్ళిందో సైబర్ నేరాలకు కూడా పాల్పడుతున్నారని హెచ్చరించారు.

పైరసీని ప్రోత్సహించవద్దు..

ఇలా సైబర్ క్రైమ్ ద్వారా ఎంతోమంది ఆర్థికంగా నష్టపోవడం లేదా ప్రాణాలు తీసుకోవడం వంటి  సంఘటనలను కూడా మనం చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పైరసీని ప్రోత్సహించవద్దని రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత దిల్ రాజు, నటుడు చిరంజీవితో పాటు నాగార్జున కూడా పాల్గొన్నారు. సినిమా పైరసీని అడ్డుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఇమ్మడి రవి ఐ బొమ్మ ద్వారా పెద్ద ఎత్తున పైరసీలకు పాల్పడటంతో భారీ స్థాయిలో చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఇక ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏదైనా చేసి చూపెడతారు అనేందుకు ఇమ్మడి రవి అరెస్ట్ నిదర్శనం. మీ ఇంట్లో ఒక గోల్డ్ చైన్ పోతే మీరు ఎంత కంగారు పడతారో.. మా సినిమా చోరీ అయినప్పుడు మేము అంతకు మించి బాధపడతాం. వేలాది మంది శ్రమ ఒక సినిమా అంటూ దిల్ రాజు మాట్లాడారు.

ఇక పైరసీల ద్వారా రవి కూడా కోట్ల రూపాయలను సంపాదించారని ఈ సందర్భంగా సజ్జనార్ వెల్లడించారు. ఆయన కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా, భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసినట్లు తెలిపారు. ఇమ్మడి రవి మూవీ పైరసీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారని ఈ సందర్భంగా సజ్జనార్ తెలిపారు. ఈయన ఏకంగా 110 డొమైన్ లను కొనుగోలు చేశారని ఒకటి బ్లాక్ చేసిన వెంటనే మరొక సైట్ లో పైరసీలకు పాల్పడ్డారు. మరి రవి అరెస్టుతో ఇప్పటికైనా పైరసీలకు పులి స్టాప్ పడుతుందా లేదంటే ఇలాగే పైరసీ కొనసాగుతున్న అనేది తెలియాల్సి ఉంది. అయితే గత కొద్ది నెలలుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం పైరసీ ఉక్కు పాదం మోపుతూ కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు.

Also Read: Ibomma Ravi : పైరసీతో కోట్ల రూపాయలు సంపాదించిన రవి.. కీలక విషయాలు వెల్లడించిన సజ్జనార్!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×