E-Paper
Advertisement

Shivaji SSS: మాట మార్చిన టీమ్.. ఓటీటీ నుండి తప్పుకున్నట్టేనా?

Shivaji SSS: మాట మార్చిన టీమ్.. ఓటీటీ నుండి తప్పుకున్నట్టేనా?
Advertisement

Shivaji SSS:ఒకప్పుడు ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘మిస్సమ్మ’ , ‘అదిరిందయ్యా చంద్రం’ వంటి చిత్రాలలో జంటగా కనిపించి, తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందరి హృదయాలను దోచుకున్నారు శివాజీ(Shivaji), లయ (Laya). అలాంటి ఈ జంట మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. తాజాగా శివాజీ స్వీయ నిర్మాణంలో “శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకం”పై రూపొందిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. దీంతో ఈ చిత్ర బృందం మాట మార్చినట్లు అనిపిస్తోంది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఓటీటీ నుండి తప్పుకున్న చిత్ర బృందం..

ఇకపోతే ఈ చిత్రాన్ని నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకొని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో చిత్ర బృందం థియేట్రికల్ వైపు మళ్లింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ వేదికగా ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు. అయితే ఇటీవల ట్రైలర్ కి వచ్చిన స్పందన ..ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని చిన్న తెరపై కాకుండా ముందుగా వెండితెరపైకి తీసుకురావాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 నుండి ఓటీటీ నుండి అటు థియేటర్ కి మార్చి… మార్చ్ 6న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కొత్త విడుదల తేదీపై శివాజీ క్లారిటీ..

Advertisement

ఈ మేరకు శివాజీ “వచ్చే నెల 6న థియేటర్లలో కలుద్దాం” అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త అధికారికమైంది. ఇక ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం కూడా అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. ప్రిన్స్, రోహన్, అలీ ,ధనరాజ్, ఇమ్మానుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రంజిన్ రాజు సంగీతం అందించగా.. ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ప్రత్యేకంగా “పాయా పాయా” అనే పాటను రూపొందించడంతో ఈ చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది..

also read:Mrunal Thakur: వాలెంటైన్స్ డే కాదు ఫూల్స్ డే.. రూమర్స్ పై మండిపడ్డ మృణాల్!

నిర్మాతగా శివాజీ సక్సెస్ అవుతారా?

Advertisement

ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. మరొకవైపు ఓటీటీ రిలీజ్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్ రిలీజ్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? నిర్మాతగా తొలి అడుగు వేసిన శివాజీకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది తెలియాలి అంటే మార్చి 6 వరకు ఎదురు చూడాల్సిందే. మరి శివాజీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో లయ జోడిగా ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. మరి ఆయన నిర్మాణం ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి

Related News

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

Big Stories

Advertisement
×