E-Paper
Advertisement

Sai Durga Tej: దర్శక ద్వయానికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

Sai Durga Tej: దర్శక ద్వయానికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ?
Advertisement

Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మేనమామల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు.. తన నటనతో ఊహించని పాపులారిటీ అందుకున్నారు. అయితే సడన్గా బైక్ యాక్సిడెంట్లో కోమా వరకు వెళ్లి వచ్చిన ఈయన.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఇండస్ట్రీలో మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పేరును కూడా మార్చుకోవడం జరిగింది. తన తల్లి పేరులోని దుర్గా అనే పదాన్ని తీసుకొని సాయి దుర్గ తేజ్ గా తన పేరును మార్చుకున్నారు. ఇక అప్పటినుంచి వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు సాయి దుర్గ తేజ్.

జోరు పెంచిన సాయి దుర్గ తేజ్..

అందులో భాగంగానే తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి ‘బ్రో’ సినిమా చేసి డిజాస్టర్ మూట కట్టుకున్న ఈయన .. ఆ తర్వాత ‘విరూపాక్షా’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ‘సంబరాల యేటిగట్టు’ అనే ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు సుమారుగా 150 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూడా.. ‘హనుమాన్’ వంటి విజువల్ వండర్ చిత్రాలను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా ఈ సినిమాలో “బలి” అనే ఒక పవర్ఫుల్, ఎమోషనల్ పాత్రలో తేజ్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటూనే..మరొకవైపు ఈ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

also read:Shivaji SSS: మాట మార్చిన టీమ్.. ఓటీటీ నుండి తప్పుకున్నట్టేనా?

దర్శక ద్వయంలో మెగా మేనల్లుడు..

అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) తో ‘క’ అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శక ద్వయం సుజిత్ – సందీప్ తమ మొదటి సినిమాతోనే టెక్నికల్ గా.. కథాపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు తమ కథతో సాయి దుర్గా తేజ్ ను మెప్పించినట్లు తెలుస్తోంది. పైగా వీరు చెప్పిన సబ్జెక్టు కూడా నచ్చడంతో సాయి దుర్గా తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట . పైగా ఈ సినిమాను మార్చి 19వ తేదీన అధికారికంగా ప్రకటించి, పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం . ఒకవైపు భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్టు.. మరొకవైపు దర్శక ద్వయంతో సినిమా.. మళ్ళీ ఈ రెండు చిత్రాలు సాయి దుర్గా తేజ్ కు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.

Advertisement

ఇకపోతే ఈ సినిమా కూడా ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని , సుజిత్ సందీప్ మార్క్ సస్పెన్స్ లేదా యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయని వార్తలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకొని తిరిగి మళ్ళీ తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెగా మేనల్లుడిగా ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×