E-Paper
Advertisement

Shivani Nagaram: ఇండస్ట్రీలోకి రాకముందు శివాని నాగారం ఆ పని చేసేదా.. పాకెట్ మనీ కోసమే అంటూ

Shivani Nagaram: ఇండస్ట్రీలోకి రాకముందు శివాని నాగారం ఆ పని చేసేదా.. పాకెట్ మనీ కోసమే అంటూ
Advertisement

Shivani Nagaram: శివాని నాగారం ప్రస్తుతం వరుస టాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఇదివరకు వరుసగా సక్సెస్ కావడంతో ఈమె క్రేజ్ ఇండస్ట్రీలో భారీగా పెరిగిపోయింది. ఇటీవల లిటిల్ హార్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హే బలవంత్(Hey Balwanth) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

తమ్ముడితో కలిసి పాటలు పాడేదాన్ని…

ఈ క్రమంలోనే నటి శివాని నాగారం(Shivani Nagaram) తనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. సాధారణంగా ఇండస్ట్రీలోకి రాకముందు ఎంతోమంది సెలబ్రిటీలు వివిధ రకాల పనులను చేసుకుంటూ వారి పాకెట్ మనీ వారే సంపాదించుకున్నామంటూ తెలియజేశారు. అయితే శివాని నాగారం కూడా ఈ కోవకే చెందిన వారని తెలుస్తుంది. ఈమె కూడా ఇండస్ట్రీలోకి రాకముందు పాకెట్ మనీ కోసం పలు ఈవెంట్స్ లో పాటలు పాడేదాన్ని అంటూ తెలియచేశారు. తన తమ్ముడితో కలిసి తాను ఈ పని చేసేదాన్ని తెలిపారు.

పాకెట్ మనీ కోసం పాటలు పాడే వాళ్ళం…

Advertisement

తన తమ్ముడితో కలిసి పాకెట్ మనీ సంపాదించడం కోసం ఏదైనా హౌస్ ఈవెంట్స్, లైవ్ బ్యాండ్స్, వెడ్డింగ్ యానివర్సరీ లాంటి పార్టీలకు వెళ్లి అక్కడ పాటలు పాడే వాళ్ళమని తెలిపారు. ఇలా పాటలు పాడటంతో వచ్చిన డబ్బుని నేను నా తమ్ముడు సగం సగం పంచుకొనే వాళ్ళమని ఇదే మా పాకెట్ మనీ గా ఉపయోగించుకునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా శివానీ నాగారం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో పాకెట్ మనీ కోసం అమ్మ నాన్నలని అడగకుండా మేము ఇలాగ సంపాదించుకునే వాళ్ళమని తెలిపారు. టీవీలలో చూసి తాము సినిమా పాటలు నేర్చుకునే వాళ్లమని ఈమె తెలియజేశారు.

శివానిలో సింగర్ కూడా దాగి ఉన్నారా..

Advertisement

ఇటీవల హే బలవంత్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈమె వేదికపై “సొగసు చూడ తరమా” అంటూ సాగిపోయే పాటను చాలా అద్భుతంగా పాడారు. ఈమె ప్రొఫెషనల్ సింగర్ తరహాలో ఈ పాట పాడటం విశేషం. శివాని నాగారం కేవలం నటిగా మాత్రమే కాకుండా తనలో సింగర్ దాగి ఉన్నారని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. హే బలవంత్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇదివరకు హే భగవాన్(Hey Bhagawan) అంటూ ప్రమోషన్లను చిత్ర బృందం నిర్వహించారు అయితే చివరి నిమిషంలో ఈ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో హే భగవాన్ కాస్త హే బలవంత్ గా మార్పులు చేశారు.

Also Read: Chiranjeevi: చిరంజీవి భుజానికి సర్జరీ… పూర్తిగా కోలుకుంటున్నానంటూ పోస్ట్!

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×