E-Paper
Advertisement

BaahubaLi Movie: బాహుబలి లోగోలో క్యాపిటిల్ ‘L’పై స్పందించిన నిర్మాత… అంతా జక్కన్న లీలలు అంటూ క్లారిటీ

BaahubaLi Movie: బాహుబలి లోగోలో క్యాపిటిల్ ‘L’పై స్పందించిన నిర్మాత… అంతా జక్కన్న లీలలు అంటూ క్లారిటీ
Advertisement

BahubaLi Movie: బాహుబలి దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి(Bahubali). ఈ సినిమా గత పది సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాని తిరిగి ఇటీవల బాహుబలి ది ఎపిక్ పేరిట విడుదల చేశారు. రీ రిలీజ్ లోను ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 53 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

బాహుబలి లోగో పై చర్చలు..

ఇలా ఈ సినిమా రీ రిలీజ్ తరుణంలో సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమా టైటిల్ లోగో ఇంగ్లీషులో bahubaLi అని ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ అయినప్పటికీ ఒక L మాత్రమే ఎందుకు కాపిటల్ లెటర్ పెట్టారనే సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా ఈ క్యాపిటల్ ఎల్ పెట్టడం వెనుక గల కారణాలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ చర్చలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.

క్యాపిటల్ ‘L’ వెనుక ఇంత కథ ఉందా?

Advertisement

ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. “నిజం చెప్పాలంటే ఈ లోగోలో క్యాపిటల్ L ఎందుకు పెట్టామో నేను కూడా మర్చిపోయాను అందుకే ఈ విషయం గురించి రాజమౌళిని అడిగానని అతను మొదటి ‘a’ పైన ఉన్న స్ట్రోక్ ను బ్యాలెన్స్ చేయడం కోసమే ఇలాంటి డిజైన్ ఎంపిక చేస్తూ క్యాపిటల్ ‘L’ పెట్టినట్లు చెప్పారని శోభు యార్లగడ్డ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ఈ విషయంపై నిర్మాత స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ లోగో వెనక జక్కన్న లీలలు ఉన్నాయంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక రాజమౌళి సినిమాల విషయంలో ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతి చిన్న విషయం గురించి చాలా లోతుగా ఆలోచించి రాజమౌళి సినిమాలను చేస్తూ ఉంటారు. ఇలా ఆయన సినిమాలలో ప్రతి సన్నివేశానికి ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వారణాసి(Varanasi) అనే పేరుతో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్లో విడుదల చేయడానికి రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్ తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read: Nagachaitanya: రెండు భాగాలుగా నాగచైతన్య NC 24… సింగిల్ సినిమాలు ఉండవేమో?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×