E-Paper
Advertisement

KTR: ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్ మళ్లీ అదే మాట, ఉప ఎన్నిక ఖాయం!

KTR: ఫార్ములా ఈ-రేసు కేసు.. కేటీఆర్ మళ్లీ అదే మాట, ఉప ఎన్నిక ఖాయం!
Advertisement

KTR: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కొత్త మలుపులు తిరుగుతుందా? ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమేనని ఎందుకన్నారు? గతంలో లొట్ట పీసు కేసు అంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్, ఇప్పుడు వెనక్కి తగ్గారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఫార్ములా ఈ-రేసు కేసుపై కేటీఆర్ వ్యాఖ్యలు

Advertisement

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. గురువారం రోజంతా దీనిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరిగింది. దీనిపై మరోసారి నోరువిప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు విప్పారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

తాను ఇదివరకే చెప్పానని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని కుండ బద్దలు కొట్టేశారు. తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెప్పారు. అదే మాట తన చేత పదేపదే ఎందుకు చెప్పిస్తున్నారని కాసింత మీడియా రుసరుసలాడే ప్రయత్నం చేశారు. ఫార్ములా వ్యవహారం గురించి మాట్లాడితే తాను ప్రెస్‌మీట్ పెట్టిన టాపిక్ డైవర్ట్ అవుతుందన్నారు.

Advertisement

తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆపై ఉప ఎన్నిక

ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడడం తగదన్నారు. ఈ విషయంలో మీడియా అర్థం చేసుకోవాలన్నారు. గతంలో ఈ కేసు తనను ఏమీ చేయలేదని పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఫార్ములా కేసును తక్కువ చూపే ప్రయత్నం చేశారాయన.  మీడియా సమావేశం తర్వాత మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ ప్రభుత్వం తనను అరెస్టు చేసే ధైర్యం చేయదని తెలిపారు. ఈ కేసులో ఏమీ లేదని సీఎంకు కూడా తెలుసన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాపాడేందుకు దానంతో రాజనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని మనసులోని మాట బయటపెట్టారు.

ALSO READ: జూబ్లీహిల్స్ ఓటమిపై షాకింగ్ నివేదిక, ఆ ఫార్ములా ఫెయిల్

శుక్రవారం మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో దాదాపు 9300 ఎకరాల భూకుంభకోణం జరుగుతున్న విమర్శలు గుప్పించారు. ఒకవేళ ఆ భూములను కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపై విచారణ చేయిస్తామని కొనుగోలుదారులను భయటపెట్టే ప్రయత్నం చేశారు కేటీఆర్.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×