E-Paper
Advertisement

Shrasti Verma: అన్యాయం జరిగింది నాకు.. న్యాయం చేయరా దేవుడా!

Shrasti Verma: అన్యాయం జరిగింది నాకు.. న్యాయం చేయరా దేవుడా!
Advertisement

Shrasti Verma: ‘అన్యాయం జరిగింది నాకు.. న్యాయం చేయరా దేవుడా!’ అని శ్రష్టి వర్మ (Shrasti Verma) ఇప్పుడనడం ఏంటి? ఆ మధ్య ఎప్పుడో అంది కదా? మళ్లీ ఎవరైనా ఆమెను ఇబ్బంది పెట్టారా? అందుకే ఇలా రియాక్టైందా? అని అనుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు.. ఇది ఆమె కొరియోగ్రఫీ చేసి, తనే పాటలో నటించిన సినిమాలోని లిరిక్. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసి, ‘న్యాయం చేయరా దేవుడా!’ అనే లిరికల్ సాంగ్‌ని మంగళవారం విడుదల చేశారు.

Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లో పార్థిబన్ ఎందుకు?.. జర్నలిస్ట్‌కు ఇచ్చిపడేసిన హరీష్ శంకర్!

ఎగబడి మరీ చూస్తున్నారు

Advertisement

ఈ పాటకున్న విశేషం ఏమిటంటే.. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తే, టాలెంటెడ్ సింగర్ సునీత్ ఈ పాటను ఆలపించడం. ఇప్పుడిదే హాట్ టాపిక్. ఒక ఐటమ్ సాంగ్‌కు సునీత వాయిస్ ఎలా సెట్ అయిందని అంతా అనుకుంటూ, ఈ పాటను ఎగబడి చూస్తున్నారు. ఇంకా ఈ పాటలో సునీత పాడుతున్నట్లుగా కూడా చూపించారు. అందుకే, ఈ పాటకు ఇంత క్రేజ్ ఏర్పడింది. మహావీర్ ఎల్లంధర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఇందులో శ్రష్టి వర్మ స్టెప్స్ చూసిన వాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్‌లో అమ్మడు స్టెప్స్‌తో అల్లాడించేసింది. ఈ సినిమా విడుదల తర్వాత శ్రష్టి వర్మకు ఇంకొన్ని స్పెషల్ సాంగ్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతగా ఈ పాటలో ఆమె తన డ్యాన్స్ మూవ్స్‌తో కట్టిపడేసింది.

Also Read- Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!

డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌

Advertisement

ఇక ఈ పాటకు సాహిత్యం అందించడమే కాకుండా, చిత్రయూనిట్‌తో కలిసి చంద్రబోస్ స్వయంగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, ఇందులో మంచి మెసేజ్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘న్యాయం చేయరా దేవుడా..’ పాటకు లిరిక్స్ అందించడమే కాకుండా, ఆవిష్కరించిన ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు ధన్యవాదాలని తెలిపారు. ఇదొక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ చిత్రమని, సీనియర్ నటీనటులతో పాటు డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ చేశారని చెప్పారు. ఆమె డ్యాన్స్, చంద్రబోస్ లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Also Read- Peddi Release Date: ఆ పాట వల్ల రామ్ చరణ్ పెద్ది సినిమాకు కష్టాలు..రిలీజ్ డేట్ మారుతుందా!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×