E-Paper
Advertisement

Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!

Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!
Advertisement

Hema and Surekha Vani: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ (Hema), సురేఖ వాణి (Surekha Vani) అంటే తెలియని వారుండరు. వెండితెరపై అక్కగా, వదినగా, తల్లిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వీరు.. నిజజీవితంలో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి గ్రామీణ వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి.. ఈ మధ్య అనుకున్నంతగా అవకాశాలు అయితే రావడం లేదు. కానీ, ఈ ఖాళీ టైమ్‌లో లైఫ్‌ని మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకున్న ఈ ఇద్దరు భామలు, తమ స్నేహితులతో కలిసి పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్, నిర్మాతలపై కేసు నమోదు.. విషయమిదే!

ఈత చెట్టు నుంచి కల్లు.. చియర్స్ భామలు

Advertisement

ఈ క్రమంలో వీరికి (Hema and Surekha Vani) సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హేమ, సురేఖ వాణిలు స్వయంగా ఒక ఈత చెట్టు వద్దకు వెళ్లి, అక్కడ ఈత చెట్టుకు ఉన్న కల్లు కుండని తప్పించి, ఆ కుండ నుంచి కల్లును గ్లాసుల్లో పోసుకుని, ఒకరికొకరు చియర్స్ చెప్పుకుంటూ చాలా సరదాగా గడిపారు. సాధారణంగా సినిమాల్లో పద్ధతిగా కనిపించే వీరు, ఇలా బయట మాస్ స్టైల్‌లో కల్లు తాగుతూ కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనికి నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో హేమ మాట్లాడుతూ.. ఇంత మంది కోతులం ఉన్నామనే పదం వాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు కూడా ‘అసలే కోతులు.. ఆ పైన కల్లు తాగారు.. ఇక చూడాలి వీళ్ల రాద్ధాంతం’ అనేలా పాత సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ‘ఏది ఏమైనా పల్లెటూరి మజానే వేరు..’ అంటూ ఈ వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Also Read- Peddi Release Date: ఆ పాట వల్ల రామ్ చరణ్ పెద్ది సినిమాకు కష్టాలు..రిలీజ్ డేట్ మారుతుందా!

ఎనర్జీ, స్నేహంతో ఖుషీ

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి, తరచుగా తన కూతురితో కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు హేమ కూడా తనదైన శైలిలో ఏదో ఒక కాంట్రవర్సీలో నిలుస్తూ.. నిత్యం వార్తలలో కనిపిస్తూనే ఉంటారు. ఇద్దరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో వీరు చూపిస్తున్న ఎనర్జీ, వారి మధ్య ఉన్న స్నేహం చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కల్లు తాగడం తప్పేం కాదు. అందులోనూ ఎండాకాలం అందరూ ఇష్టపడుతుంటారు. దీనికి వారిపై ఏదేదో ఊహించేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ, రేపు ఇవన్నీ కామన్. కాబట్టి, ఓ వారి గురించి నెగిటివ్‌గా ఆలోచించకుండా.. ఇందులో వారిద్దరూ ఎంత ఆనందంగా ఉన్నారో.. దానిని ఎంజాయ్ చేస్తే బెటర్.

Also Read- Renu Desai: రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు.. ఇద్దరిపై సైబర్ క్రైమ్ కేసు

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×