E-Paper
Advertisement

Harish Shankar: ‘ఉస్తాద్’లో పార్థిబన్ ఎందుకు?.. జర్నలిస్ట్‌కు ఇచ్చిపడేసిన హరీష్ శంకర్!

Harish Shankar: ‘ఉస్తాద్’లో పార్థిబన్ ఎందుకు?.. జర్నలిస్ట్‌కు ఇచ్చిపడేసిన హరీష్ శంకర్!
Advertisement

Harish Shankar: టాలీవుడ్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ (Harish Shankar) ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడతారనే విషయం తెలియంది కాదు. అలా ఆయన మాట్లాడతారని తెలిసే, ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు సజెషన్స్ ఇచ్చారు. కాస్త ఓపికగా ఉండటం నేర్చుకోమని చెబుతుంటానని అన్నారు. అయినా హరీష్‌లో నో ఛేంజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధమైన సందర్భంగా మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరిగింది. సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ తమిళ నటుడు పార్థిబన్‌ను తీసుకోవడంపై ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా, హరీష్ శంకర్ తనదైన శైలిలో సమాధానమిచ్చి కౌంటరిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్, నిర్మాతలపై కేసు నమోదు.. విషయమిదే!

ఫహద్ ఫాజిల్‌ని ‘పుష్ప’కు ఎందుకని అనుకుంటే..

Advertisement

సినిమాలో పార్థిబన్‌ (Parthiban) ఎందుకు? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ.. ‘‘ఇది అవసరం కాదు, క్రియేటివ్ ఫ్రీడమ్’ అని నొక్కి చెప్పారు. ఒక దర్శకుడిగా కథ రాసుకున్నప్పుడు, ఒక పాత్రకు ఎవరు సరిపోతారో ఊహించుకోవడం తన హక్కు అని ఆయన వివరించారు. ఉదాహరణగా ‘పుష్ప’ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రస్తావిస్తూ, దర్శకుడు సుకుమార్ ఆ పాత్రను ఊహించుకున్నారు కాబట్టే అది అంతలా పండిందని, అటువంటి ప్రయోగాలే సినిమాకు కొత్తదనాన్ని ఇస్తాయని అన్నారు. అంతెందుకు ‘కాంతార 2’ సినిమాకు ఏపీలో పవర్ స్టార్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటే ఎక్కువగా టికెట్ల హైక్ ఇచ్చారని మరో ఉదాహరణ చెప్పారు.

Also Read- Hema and Surekha Vani: కల్లు తాగుతూ.. హేమ, సురేఖ వాణి హల్‌చల్.. వీడియో వైరల్!

ఇలాంటి ప్రశ్నలకు తావులేదు

Advertisement

డిజిటల్ విప్లవం ఉన్న ఈ రోజుల్లో భాషా పరిమితులు లేవని, మనం ఎక్కడో ఉన్న ఢిల్లీ ట్వీట్లకు, చెన్నై సినిమాలకు స్పందిస్తున్నప్పుడు.. ఒక నటుడిని వేరే భాష నుండి తీసుకోవడంలో తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడికి ఉన్న సృజనాత్మకత, విజన్ అనే ఊహల నుండే ఇలాంటి పాత్రలు పుడతాయి. తెలుగు వాళ్ళం కదా అని కేవలం తెలుగు రీల్స్ మాత్రమే చూడం కదా, అన్నీ చూస్తాం.. అలాగే నటీనటుల ఎంపిక కూడా ఉంటుందంటూ హరీష్ క్లారిటీ ఇచ్చారు. దీంతో సదరు జర్నలిస్ట్ ఏదో కవర్ చేయాలని చూసినా హరీష్ మాత్రం ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అసలు అడగాల్సిన అవసరం లేదంటూ.. తన ముక్కుసూటి తనాన్ని ప్రదర్శించారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేస్తున్న ఈ రెండో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ఉగాది స్పెషల్‌గా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

Also Read- Anirudh Ravichander: గ్లోబల్ డీల్‌కు ఓకే చెప్పిన అనిరుధ్.. బక్కోడి ప్లానే వేరయా!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×