E-Paper
Advertisement

Shriya Saran: అది నేను కాదు…సమయం వృథా చేసుకోవద్దు…హెచ్చరించిన శ్రేయ శరణ్!

Shriya Saran: అది నేను కాదు…సమయం వృథా చేసుకోవద్దు…హెచ్చరించిన శ్రేయ శరణ్!
Advertisement

Shriya Saran: ఇటీవల కాలంలో సెలెబ్రెటీల పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వారికి సంబంధం లేకుండా వారి ఫోటోలు వీడియోలు అలాగే వారి వాయిస్ కూడా ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెర లేపుతున్నారు. ఇలా సెలబ్రిటీల పేరు, ఫోటోలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో అది మోసం అని తెలియక ఎంతోమంది నష్టపోతున్నారు. ఇలా తమ పేరిట ఇలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు తమ అభిమానులను ఈ మోసాల బారిన పడకుండా హెచ్చరిస్తున్నారు.

నటి శ్రేయ పేరుతో వాట్సాప్ చాటింగ్…

గత రెండు రోజులుగా ప్రముఖ నటి అతిథి రావు హైదరి వాట్సాప్ ద్వారా తన పేరుపై మోసాలు జరుగుతున్నాయి అంటూ ఈమె అభిమానులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటి శ్రేయ(Shriya) పేరు మీద కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె కూడా ఈ మోసాల పట్ల స్పందిస్తూ తమ అభిమానులకు ఈ మోసాల పట్ల జాగ్రత్తలు తెలిపారు. ఈ విషయం గురించి నటి శ్రేయ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను హెచ్చరించారు. తన పేరు మీద సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాట్సాప్ నెంబర్ ఎవరిదో నాకు తెలియదు. అది నేను మాత్రం కాదని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించండి నా పేరు మీద అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలని పథకం వేశారు.

ఇలాంటి మెసేజ్ లకు స్పందించవద్దు..

Advertisement

ఏంటంటే ఆ వ్యక్తి నా కుటుంబంలో మాత్రమే కాకుండా నేను పని చేస్తున్న వారికి కూడా ఇలాంటి సందేశాలను పంపుతున్నారని, ఇలాంటి వాటి పట్ల మీరు స్పందిస్తూ మీ సమయం వృధా చేసుకోవద్దు ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించండి అంటూ శ్రేయ తన అభిమానులను హెచ్చరించారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఫోటోలను వారి వీడియోలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఏమాత్రం మనం జాగ్రత్త వహించకపోయిన పెద్ద ఎత్తున మోసపోవాల్సి వస్తుంది.

సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా శ్రేయ..

Advertisement

ఇలా ఎంతోమంది సెలబ్రిటీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు ఇలాంటి సైబర్ నేరాల నుంచి అభిమానులను హెచ్చరిస్తూ జాగ్రత్త పడమని కోరుతున్నారు. ఇక శ్రేయ కెరియర్ విషయానికి వస్తే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవల కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కీలక ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లో కూడా సందడి చేస్తున్నారు. శ్రేయ ఇటీవల తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమాలో తేజ సజ్జకు తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాల ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Also Read: Chikoti Praveen: నాస్తిక కుక్క… రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత చికోటి ప్రవీణ్

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×