E-Paper
Advertisement

Chikoti Praveen: నాస్తిక కుక్క… రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత చికోటి ప్రవీణ్

Chikoti Praveen: నాస్తిక కుక్క… రాజమౌళికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత చికోటి ప్రవీణ్
Advertisement

Chikoti Praveen: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన వారణాసి(varanasi) సినిమా వేడుకలో భాగంగా హనుమాన్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. తనకు దేవుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా ఈయనపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీకి చెందిన కొంతమంది నేతలు ఈ ఘటనపై స్పందిస్తూ రాజమౌళికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇదివరకే బీజేపీ మహిళా నేత మాధవి ఈ వివాదం పై స్పందించి రాజమౌళికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదం మరొక బీజేపీ నేత చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)స్పందించారు.

మదం ఎక్కిన ఏనుగు..

ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. రాజమౌళి హిందూ దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడటం సరికాదని తెలిపారు. మదం ఎక్కిన ఏనుగు మురికి కాలవలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందని మండిపడ్డారు. వెంటనే రాజమౌళి దేవుళ్ల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని లేదంటే హిందూ సమాజం నిన్ను క్షమించదని తెలియజేశారు. రాజమౌళికి దేవుడంటే నమ్మకం లేదని చెబుతూనే దేవుడి పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నావు. దేవుడిపై నమ్మకం లేదని చెప్పిన నువ్వు నీ సినిమా విడుదలకు ముందు ప్రారంభానికి ముందు పూజా కార్యక్రమాలను ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

మీ నాస్తిక కుక్కలకే సినిమా చూపించు..

Advertisement

దేవుడంటే నమ్మకం లేని నువ్వు తీసే సినిమాలు ఈ హిందూ సమాజం చూడకపోతే పరిస్థితి ఏంటి? నీ నాస్తిక కుక్కలను మాత్రమే నీ సినిమా చూడటానికి స్వాగతించు. నీ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని హిందువులు నీ సినిమాలు చూడకపోతే మీ బ్రతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో.. నువ్వు చేసిన బాహుబలి సినిమాలోనే స్పష్టంగా చెప్పావు. అహంకారంతో విర్రవీగిన భల్లాల దేవ బ్రతుకు ఎలా పతనమైందో స్వయంగా నువ్వే సినిమా ద్వారా చూపించావు. మరి ఇప్పుడు నువ్వు కూడా అదే అహంకార ధోరణిలో వెళ్తున్నావు నీ పతనం కూడా ప్రారంభం అవుతుంది.

క్షమాపణలు చెప్పి తీరాల్సిందే..

Advertisement

ఇలా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చికోటి ప్రవీణ్ ఈ సందర్భంగా రాజమౌళిని హెచ్చరించారు. వెంటనే హిందూ సమాజానికి ఆయన క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అంటూ ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. రాజమౌళి వివాదం గురించి ఇప్పటికే ఎంతోమంది స్పందిస్తూ రాజమౌళికి వార్నింగులు ఇస్తున్నప్పటికీ ఇంతవరకు వారణాసి చిత్ర బృందం కానీ లేదా దర్శకుడు రాజమౌళి కానీ ఎక్కడ ఈ వివాదంపై స్పందించకపోవడం గమనార్హం. మరి రాజమౌళి ఈ ఘటన గురించి స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత మధ్య గొడవలు..వార్ వన్ సైడ్ అంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×