E-Paper
Advertisement

Shriya Saran: కనకం కన్నే కొడితే పెళ్లానైనా వదిలేస్తారు.. ఐటెంసాంగ్ తో అదరగొట్టిన శ్రియా శరన్

Shriya Saran: కనకం కన్నే కొడితే పెళ్లానైనా వదిలేస్తారు.. ఐటెంసాంగ్ తో అదరగొట్టిన శ్రియా శరన్
Advertisement

Shriya Saran:అందాల భామ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. సాధారణంగా వయసు పెరిగిన కొద్దీ హీరోయిన్లకు అవకాశాలతో పాటు అందం కూడా తగ్గుతూ వస్తుంది. కానీ, శ్రియకు ఆ రెండు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా శ్రియా తన అందంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వస్తుంది. ఒకపక్క తల్లి పాత్రలు చేస్తూనే ఇంకోపక్క గ్లామరస్ పాత్రలకు సై అంటుంది. ఈ ఏడాది మిరాయ్ సినిమాలో తేజ సజ్జాకు తల్లిగా నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.

ఒకపక్క సినిమాలు చేస్తూనే  ఇంకోపక్క 43 ఏళ్ల వయసులో కూడా ఐటమ్ సాంగ్ చేసి షాక్ ఇచ్చింది. గతంలో శ్రియ చాలా ఐటమ్ సాంగ్స్ లో నటించింది. అందులో దేవదాసు, కొమరం పులి, తులసి సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడ ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అందులో అమ్మడి అందాల ఆరబోత అయితే కుర్రకారు అంత ఈజీగా మర్చిపోరు.

Advertisement

ఇక తాజాగా మరో మారు శ్రియ ఐటమ్ భామగా మారింది. తమిళ హీరో మెట్రో శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నాన్ వైలెన్స్. ఆనందకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహ, యోగిబాబు, అదితి బాలన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా  అన్ని భాషల్లో  రిలీజ్ కు సిద్ధమవుతుంది.

ఇక ఈ చిత్రంలో శ్రియ శరన్ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ లో మెరిసింది. కనకం అంటూ సాగే ఈ సాంగ్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను యువన్ శంకర్ రాజా, తేజస్విని నందిభట్ల ఆలపించారు.  ఎప్పటిలాగే శ్రియా ఈ సాంగ్ లో అందాలు ఆరబోస్తూ ఎంతో అందంగా కనిపించింది.

Advertisement

43 ఏళ్ల వయసులో కూడా అమ్మడు ఈ రేంజ్ లో డాన్స్ చేస్తూ అందాలను ఆరబోస్తూ కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికి శ్రియా అందం  ఇసుమంతైన తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సాంగ్ కనుక హిట్ అయితే శ్రియను ఆపడం ఎవరివల్లా కాదు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో శ్రియాకు ఎలాంటి విజయం దక్కుతుందో చూడాలి.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×