E-Paper
Advertisement

Shruti Hassan : ఇది నా శరీరం, నాకు నచ్చిన సర్జరీలు చేసుకుంటాను , ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతి

Shruti Hassan : ఇది నా శరీరం, నాకు నచ్చిన సర్జరీలు చేసుకుంటాను , ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శృతి
Advertisement

Shruti Hassan : కొంతమందిలో విపరీతమైన టాలెంట్ ఉన్నా కూడా సక్సెస్ అంత ఈజీగా రాదు. శృతిహాసన్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ వారసురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనలో మల్టీ టాలెంట్స్ కూడా బయట పెట్టండి. తెలుగులో చేసిన అనగనగా ఒక ధీరుడు, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తాయి అని బలంగా నమ్మింది.

అనగనగా ఓ ధీరుడు వచ్చినప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి విపరీతంగా ఆ సినిమాను ఎలివేట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా జగదేకవీరుడు మగధీర సినిమాలు కలిపితే ఎలా ఉంటుందో అనే రేంజ్ లో అప్పట్లో మాట్లాడారు. సిద్ధార్థ, శృతిహాసన్ కలిసిన నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కంప్లీట్ డిజాస్టర్ గా మారిపోయింది. అయితే శృతిహాసన్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో వచ్చింది.

నాకు నచ్చిన సర్జరీలు చేసుకుంటాను 

Advertisement

ఇప్పటికీ శృతిహాసన్ గురించి కొన్ని ట్రోలింగ్స్ వినిపిస్తూ ఉంటాయి. తనది ప్రస్తుతం ఉన్నది అసలైన అందం కాదని తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని విపరీతంగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో రావడం వలన సెలబ్రిటీల దృష్టికి కూడా చేరుతూ ఉంటాయి.

అతనికి తన మీద వచ్చిన కామెంట్స్ గురించి రెస్పాండ్ అయింది శృతిహాసన్. తన ముఖంపై చేసిన రైనోప్లాస్టీ గురించి రియాక్ట్ అయింది. రైనో ప్లాస్టి అంటే ముక్కుకు సంబంధించిన ఒక శస్త్ర చికిత్స. అలానే లిప్ ఫిల్లర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఇది నా శరీరం, అలానే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటాను అని స్ట్రాంగ్ గా చెప్పింది శృతిహాసన్.

Advertisement

ఆమె చేసిన రైనో ప్లాస్టి కు కారణం అందంగా కనిపించడం మాత్రమే కాదు, తన ముక్కుకు ఒకప్పుడు ఏదో గట్టిగాయం తగిలిందట. అందుకోసమే ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చింది.

ఇకనైనా మారుతారా? 

ఈరోజుల్లో సోషల్ మీడియా వలన పాజిటివిటీ ఎంతుందో అంతకు మించిన నెగెటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే సెలబ్రిటీలు చేసే ప్రతి పని వెనకాల కొన్ని వ్యక్తిగత కారణాలు వాళ్లకు ఉండే ఉంటాయి. అని ఆ కారణాలను ఎవరు బయటకు పెద్దగా చెప్పరు. ఇలా విపరీతమైన ట్రోలింగ్ జరిగినప్పుడు మాత్రమే దాని గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తారు.

అయితే ఇప్పుడు శృతిహాసన్ ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి కొంతమేరకు ట్రోలింగ్ తగ్గే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. ఇక రీసెంట్గా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో సంచారి అనే పాటను పాడింది శృతిహాసన్. ఆ పాట ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాట పాడుతున్నప్పుడు కూడా శృతి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Spirit : ఉమెన్స్ కాలేజీలో స్పిరిట్ మూవీ షూటింగ్, ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×