E-Paper
Advertisement

Spirit : ఉమెన్స్ కాలేజీలో స్పిరిట్ మూవీ షూటింగ్, ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే

Spirit : ఉమెన్స్ కాలేజీలో స్పిరిట్ మూవీ షూటింగ్, ప్రభాస్ జాయిన్ అయ్యేది అప్పుడే
Advertisement

Spirit : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన పూజ పూర్తయిపోయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పూజా కార్యక్రమంలో ప్రభాస్ ఎక్కడ కనిపించలేదు. కేవలం ప్రభాస్ చేతులను మాత్రమే చూపించాడు సందీప్ రెడ్డి వంగ.

సందీప్ రెడ్డి వంగ సినిమా రైటింగ్ కి ఎక్కువ టైం తీసుకుంటాడు. కానీ ఒకసారి కథ పూర్తయిన తర్వాత దానిని అతి త్వరగా ఫినిష్ చేస్తాడు. అందుకే అనిమల్ వంటి సినిమాను కూడా కేవలం 100 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు. ఆ రేంజ్ సినిమాను కేవలం 100 రోజుల్లో తీయడం అనేది మామూలు విషయం కాదు. ఎడిటర్ గా కూడా సందీప్ రెడ్డి వంగాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఆ సినిమాని త్వరగా పూర్తి చేయగలిగాడు.

స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ 

Advertisement

ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ షూటింగ్లో ప్రభాస్ రేపటి నుంచి జాయిన్ కానున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కూడా విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. అనిమల్ సినిమాకు ఎలా అయితే ఒక వీడియో విడుదల చేసి అనౌన్స్మెంట్ చేశాడు అచ్చం ఈ సినిమా కూడా అలానే చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్ మూడు గెటప్స్ లో కనిపించబోతున్నట్లు బయట సమాచారం వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ రెండు గెటప్స్ కూడా కన్ఫామ్ అయిపోయాయి.

విజయ్ నువ్వు ఫాలో అవుతారా? 

Advertisement

గత కొన్ని రోజులుగా కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ ఏ గెటప్ లో కనిపించారు అదే గెటప్ లో ప్రభాస్ కూడా కనిపించబోతారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమాను 2026లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ పూర్తయిపోయింది. సందీప్ రెడ్డివంగా షూటింగ్ కు వెళ్లేటప్పుడే బ్యాక్గ్రౌండ్స్ కోరితే వెళ్తాడట. షూటింగ్ కూడా సెట్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తూ సీన్స్ షూట్ చేస్తాడు. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

Also Read: Raju Weds Rambai: నువ్వు బట్టలిప్పుతాను అనగానే నాకు వణుకు పుట్టింది, బాబీ షాకింగ్ కామెంట్స్

Related News

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

Big Stories

Advertisement
×