Shruti Haasan:కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న శృతిహాసన్ (Shruti Haasan) భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కమలహాసన్ (Kamala Hassan) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. కెరియర్ కంటే కూడా వ్యక్తిగతంగా పలుమార్లు వార్తల్లో నిలిచిన శృతిహాసన్.. ఇప్పుడు వివాహ వ్యవస్థ పై అలాగే తల్లి కావాలనే తన కోరికపై అభిప్రాయాలను పంచుకుంది.
ఒకవైపు పాన్ ఇండియా మూవీలలో నటిస్తూనే.. మరొకవైపు పలు చిత్రాలకు తన అద్భుతమైన గాత్రాన్ని అందిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తాజాగా బాలీవుడ్ నటి సోహ అలీఖాన్ నిర్వహించిన పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న శృతిహాసన్.. ఇప్పటికీ సింగిల్ గా ఉండడం పై, అలాగే తల్లి అవ్వాలంటే పెళ్లి అవసరమా? అనే విషయాలపై స్పందించింది. శృతిహాసన్ మాట్లాడుతూ..” తల్లిగా మారేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది.? ఒకరకంగా చెప్పాలి అంటే.. తల్లి కావాలి అంటే పెళ్లి కచ్చితంగా అవసరమా ? అనే ప్రశ్న నాలో మొదలవుతోంది. తల్లి కావాలంటే ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి . అందులో ఒకటి పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నా జీవన విధానంలో భాగంగా సహజంగా కూడా అమ్మ కావాలని ఉంది” అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
ఇదే పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తాను సింగిల్ గా ఉండడంపై కూడా స్పందించింది శృతిహాసన్.” నా వయసు 40కి చేరువ అవుతున్నా.. నేను ఇంకా సింగిల్గానే ఉంటున్నానని అందరూ అనుకుంటున్నారు. నిజానికి వివాహ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. నాకు తోడుగా ఉండే భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాను. ఎప్పుడూ ఒకే దగ్గర ఇమిడి పోయే మనిషిని కాదు. నా జీవితాన్ని నా ఇష్టప్రకారమే జీవించాలని కోరుకునే అమ్మాయిని. కొన్ని విషయాల్లో నేను సాంప్రదాయబద్దంగా ఉంటాను. మరికొన్నింటిలో పాత పద్ధతులకే కట్టుబడి ఉంటాను. అయితే నాపై ఎవరు బలవంతం చేయకపోవడం వల్లే ఆ పద్ధతులు పాటిస్తున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చింది.
also read:కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా?
ఇకపోతే ఇదే సమయంలో పెళ్లిళ్లలో జరిగే ఆర్భాటాలపై కూడా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది. పెళ్లి పత్రాలు, కోట్ల రూపాయలు ఖర్చులు, షో ఆఫ్ అన్ని చూస్తే ఇదంతా అసలు ఎవరి కోసం చేస్తున్నాం అనిపిస్తుంది. లీగర్ పేపర్ల బంధం కంటే ప్రతిరోజు ఇద్దరం ఒకరినొకరు మనస్పూర్తిగా ఎంచుకోవడమే నిజమైన ప్రేమ.. భారీగా ఖర్చు పెట్టే వారితో నాకేమీ సమస్య లేదు. కానీ ఆ డబ్బును ఏదైనా సేవా కార్యక్రమాలకు లేదా ఛారిటీకి ఇస్తే బాగుంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో షో ఆఫ్ చేస్తే నష్టం ఎవరికి అంటే భరించిన వాడికే . బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుందే తప్ప హంగు ఆర్భాటాలలో కాదు అంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.ఇక శృతిహాసన్ చేసిన ఈ కామెంట్లు వివాహ వ్యవస్థ పై పంచుకున్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.