Kumari aunty:కుమారి ఆంటీ.. ఈ పేరు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా “మీది మొత్తం రూ.1000 అయింది. రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే ఒక డైలాగ్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఐటిసి కోహినూర్ ప్రాంతంలో రోడ్డు పక్కనే ఒక చిన్న హోటల్ నడిపే ఈమె.. సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈమె డైలాగును ఎంతోమంది రీల్స్ కూడా చేశారు. అంతేకాదు చాలామంది ఈమె హోటల్ కి వెళ్లి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయడమే కాకుండా వాటికి రివ్యూ కూడా ఇస్తున్నారు. అలా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే ఆమె నట కిరీటి రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమాలో నటించిన ఈమె.. ఈ సినిమాను థియేటర్లో చూసి.. ఆ టికెట్ ను తన వద్దకు తీసుకువచ్చిన వారికి. తన హోటల్ ఫుడ్ బిల్లు పై వంద రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తానని ప్రకటించి మరోసారి వైరల్ అయింది.
రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. తన రోజువారి సంపాదన అలాగే తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.. ఇప్పటికే తాను మొత్తం ఏడు సినిమాలలో నటిస్తున్నాను అని చెప్పింది. కుమారి ఆంటీ మాట్లాడుతూ..” ప్రస్తుతం రోజుకు రూ.20 వేల వరకు నా ఆదాయం ఉంటుంది. అయితే దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి. గతంలో ఉప్పు, పప్పులు, చికెన్ ధరలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. ఆదాయం ఎంత ఉంటుందో.. ఖర్చులు కూడా అంతే ఉంటాయి. అందరూ కలిసి నా హోటల్ తీయాలి అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడారు. నా దృష్టిలో ఆయన ఎప్పటికీ దేవుడే. ప్రస్తుతం నేను 7 సినిమాల్లో నటిస్తున్నాను”. అంటూ తెలిపింది. మొత్తానికి అయితే రోజుకు రూ.20,000 సంపాదన అని చెప్పడంతో నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తోందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
నా బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాలి అంటే..” నేను మా ఊర్లో ఉదయం 5 గంటల నుంచి పొలం పనులకు వెళ్లే దాన్ని.. ఆ రోజుల్లో చాలా తక్కువ కూలీ.. పైగా మిషన్ కూడా కుట్టేదాన్ని. రోజుకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఏదైనా సాధించాలనే తపనతో నా భర్తతో కలిసి హైదరాబాద్ కి వచ్చాను. ఇక్కడ 2011లో బిజినెస్ మొదలు పెట్టాను.బిజినెస్ ఫేమస్ అవ్వకముందే నాకు ఎక్కువ గిరాకీ వచ్చేది. “మీది మొత్తం వెయ్యి అయ్యింది. 2 లివర్లు ఎక్స్ట్రా ” అనే మాట వైరల్ అయిన తర్వాత మా హోటల్ కి క్రౌడ్ కూడా పెరిగింది. దీంతో చాలామంది అక్కడికి రావడానికి భయపడ్డారు.
also read:కొంచెం విషమిచ్చి చంపేయండి- పవిత్ర గౌడ!
యూట్యూబ్ వల్ల నా హోటల్ గురించి పబ్లిక్ కు బాగా తెలిసింది . కానీ సెలబ్రిటీలు 7 సంవత్సరాల ముందు నుంచే నా హోటల్ కి వచ్చేవాళ్ళు. సుడిగాలి సుధీర్ ఒక సినిమా షూటింగ్ మా హోటల్ లోనే జరిగింది. పదేళ్ల క్రితం ఆ ఏరియాలో ఏ సినిమా షూటింగ్ జరిగినా.. మా దగ్గరే ఫుడ్ కోసం వచ్చేవాళ్లు. నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ అడుగుతూ ఉంటారు. అంతేకాదు ఇంటికి పార్సిల్ కూడా పట్టుకెళ్లేవారు. ఫేమస్ అవ్వకముందు రోజు 1500 మంది నా హోటల్ కి వచ్చేవాళ్లు.. కానీ ఇప్పుడు వెయ్యి మంది వరకు వస్తున్నారు.
గతేడాది బిగ్ బాస్ నుంచి కూడా కాల్ వచ్చింది. అప్పుడు వెళ్లలేదు. అయితే ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను అంటూ తెలిపింది కుమారి ఆంటీ.