E-Paper
Advertisement

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!
Advertisement

Kavach 4.0: స్వేచ్ఛ బ్యూరో: రైళ్ల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డును నెలకొల్పింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మల్కాజ్‌గిరి – కామారెడ్డి సెక్షన్‌లో 108 రూట్ కిలోమీటర్ల మేర అత్యంత అధునాతన ‘కవచ్ వెర్షన్ 4.0’ అప్‌గ్రేడేషన్ పనులను రైల్వే శాఖ విజయవంతంగా పూర్తి చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సరికొత్త రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమం. మంగళవారం ప్రత్యేక రైలులో ప్రయాణించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ మార్గంలో కవచ్ 4.0 పనితీరును తనిఖీ చేశారు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే పలు అత్యవసర పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి, ఈ సరికొత్త వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుందో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా జీఎం సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతను పెంపొందించేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ఈ ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవచ్ 4.0)ను తీసుకువచ్చిందని తెలిపారు. గతంలో జోన్ పరిధిలోని 1465 రూట్ కిలోమీటర్లలో వాడిన 3.2 వెర్షన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దీనిని పటిష్టంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. లోకో పైలట్ల పొరపాట్ల వల్ల జరిగే ప్రమాదాలు, సిగ్నల్ దాటి రైళ్లు ముందుకు వెళ్లకుండా నిరోధించడం, ఓవర్ స్పీడ్‌ను కంట్రోల్ చేయడం వంటి పనులను ఇది ఆటోమేటిక్‌గా చేస్తుందన్నారు. తద్వారా రైళ్లు ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలు తప్పుతాయని, దట్టమైన పొగమంచు, తుఫాను వంటి ప్రతికూల వాతావరణంలోనూ రైళ్లు సురక్షితంగా నడిచేందుకు ఇది తోడ్పడుతుందన్నారు.

భారీ స్థాయిలో కవచ్ 4.0

Advertisement

పెద్ద యార్డులలో సిగ్నళ్ల సమాచారాన్ని మరింత స్పష్టంగా చూపడం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా స్టేషన్ల మధ్య నేరుగా కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో అనుసంధానం ,అత్యంత కచ్చితమైన లొకేషన్ వివరాలను సేకరించే సాంకేతికత ఇందులో ఉన్నాయన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా కవచ్ 4.0ను భారీ స్థాయిలో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జీఎం పేర్కొన్నారు. అనంతరం కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లను సందర్శించారు. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ఈ స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రయాణికుల సదుపాయాలు, సర్క్యులేటింగ్ ఏరియాలను పరిశీలించారు. ప్రయాణికుల భవిష్యత్తు అవసరాలకు, డిమాండ్‌కు అనుగుణంగా స్టేషన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ పి.వి. మురళీకృష్ణ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) సంతోష్ కుమార్ వర్మ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

Tags

Related News

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

హోటల్ గదిలో చెక్ ఇన్ చేశాక ఈ 5 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి.. లేకపోతే ప్రమాదకరం

పట్టాలపై నీడలు.. స్టేషన్‌లో వింత శబ్దాలు.. దేశంలోని హాంటెడ్ రైల్వే స్టేషన్లు ఇవే!

నవ్వులు.. ఏడుపులు.. వింత ఆకారాలు.. డుమాస్ బీచ్ కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

మంచు కరిగితే బయటపడే వందలాది అస్థిపంజరాలు.. రూప్‌కుండ్ సరస్సు వందల ఏళ్ల మిస్టరీ!

సాధువు శాపం.. తాంత్రికుడి మరణం.. రత్నావతి ప్రేమకథలో ఇంత భయంకరమైన ట్విస్ట్ ఉందా?

దెయ్యాల కథలు, రహస్య ప్రదేశాలు.. ఇండియాలో కొత్త ట్రావెల్ ట్రెండ్

Big Stories

Advertisement
×