E-Paper
Advertisement

పెద్ది స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ షాకింగ్ రెమ్యూనరేషన్…

పెద్ది స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ షాకింగ్ రెమ్యూనరేషన్…
Advertisement

Shruti Hassan: శృతిహాసన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె ఇటీవల సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా శృతిహాసన్(Shruthi Hassan) రామ్ చరణ్(Ramcharan) హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కేవలం స్పెషల్ సాంగ్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది.

పెద్దితో జతకట్టనున్న శృతిహాసన్…

చిత్ర బృందం ఏప్రిల్ 30వ తేదీ నుంచి వాయిదా వేస్తూ జూన్ నెలలో విడుదల కాబోతుందని తెలిపారు. కానీ సరైన విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమా 25వ తేదీ రాబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం స్పెషల్ సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ విషయంలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ స్పెషల్ సాంగ్ లో మృణాళ్ ఠాకూర్, మానస వారణాసి, సంయుక్త మీనన్ వంటి తదితరులు నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని, ఈ స్పెషల్ సాంగ్ లో శృతిహాసన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఒక్క పాటకు కోట్లలో రెమ్యూనరేషన్..

Advertisement

చిత్ర బృందం ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా ఇప్పటికే శృతిహాసన్ రిహార్సల్స్ లో పాల్గొన్నారని ,త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయటం కోసం శృతిహాసన్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం శృతిహాసన్ ఒక స్పెషల్ సాంగ్ కోసమే ఏకంగా 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది. సాధారణంగా శృతిహాసన్ ఒక పూర్తి స్థాయి సినిమాలో చేస్తేనే నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

ఎవడు సినిమాలో జతకట్టిన జోడి…

ఇక ఒక పాట కోసమే 2.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి. మరి శృతిహాసన్ తీసుకోబోతున్న ఈ రెమ్యూనరేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్రబృందం అధికారకంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించగా శృతిహాసన్ స్పెషల్ సాంగ్ మాత్రమే చేస్తున్నారు. ఇక శృతిహాసన్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఇదివరకే ఎవడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి పెద్ది స్పెషల్ సాంగ్ ద్వారా ఈ జంట తెరపై సందడి చేయబోతున్నారు.

Advertisement

Also Read: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. ఫోటోలు వైరల్!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×