E-Paper
Advertisement

ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. ఫోటోలు వైరల్!

ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్.. ఫోటోలు వైరల్!
Advertisement

Bellamkonda srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా కావ్య రెడ్డి (Kavya Reddy)అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఒకటి కాబోతున్నారు. మరొక మూడు రోజులలో వీరి పెళ్లి వేడుక జరగబోతున్న నేపథ్యంలో అప్పుడే వీరి ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. నేడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకు(Pelli Koduku) వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కొడుకు అయిన సాయి శ్రీనివాస్..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas)ఇంట్లో తన కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్ళికొడుకు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకుగా ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అభిమానులు ముందుగానే కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో భాగంగా కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారు.

తిరుపతిలో వివాహం..

Advertisement

ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుపతిలో వివాహం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనంతరం సినీ సెలబ్రెటీలకు రాజకీయ నాయకులకు ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీరి వివాహ రిసెప్షన్ మే ఒకటవ తేదీ హైదరాబాద్ లో జరగబోతుంది. ఇక ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలు అందరినీ స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇలా స్టార్ హీరోలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే మంత్రులను కూడా ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానించారు.

Advertisement

గత కొద్దిరోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ ఫ్యామిలీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందజేశారు. ఇక సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి ఏప్రిల్ 5వ తేదీ హైదరాబాద్ లోని వారి ఫామ్ హౌస్ లో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట పెళ్లి వేడుకను తిరుపతిలో జరుపుకోబోతున్నారు. రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు. కావ్య రెడ్డి కుటుంబం పలు వ్యాపారాలను నిర్వహించడమే కాకుండా ఈమె తండ్రి లాయర్ అని తెలుస్తోంది.

Also Read: శ్రీ సత్యతో లవ్.. బ్రేకప్ పై అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్..వారి శాపమే అంటూ!

Related News

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Big Stories

Advertisement
×