E-Paper
Advertisement

జమ్మి మొక్కను ఏ దిశలో నాటితే అదృష్టం వరిస్తుంది? పూర్తి వివరాలు మీ కోసం..

జమ్మి మొక్కను ఏ దిశలో నాటితే అదృష్టం వరిస్తుంది? పూర్తి వివరాలు మీ కోసం..
Advertisement

Vastu Tips: మన హిందూ సంప్రదాయంలో చెట్టును కూడా దైవంగా పూజించడం ఒక అందమైన ఆచారం. ఇంటి ఆవరణలో పెంచుకునే కొన్ని మొక్కలు కేవలం అందం కోసమే కాకుండా.. మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి. అలాంటి వాటిలో జమ్మి మొక్క లేదా షమీ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల శని దేవుడి కోపం తగ్గుతుందని, పరమశివుడి కరుణ కలుగుతుందని మన పెద్దలు చెబుతుంటారు.

భక్తితో ముడిపడిన జమ్మి విశిష్టత:

పురాణాల కథల ప్రకారం జమ్మి చెట్టులో శని దేవుడు కొలువై ఉంటాడని ఒక నమ్మకం. ఎవరికైనా జాతకంలో శని దోషాలు ఉన్నా లేదా గ్రహ గతులు అనుకూలించకపోయినా, ఈ మొక్కను పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శివయ్యకు కూడా జమ్మి ఆకులంటే ప్రాణం. అందుకే పూజ సమయంలో శివుడికి ఈ పత్రాలను సమర్పిస్తే మనకున్న కష్టాలన్నీ తీరిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది మన ఇంటికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది.

Advertisement

Also Read:  బాత్రూమ్‌లో ఈ తప్పులు చేస్తే.. రోగాలు వెంటాడటం ఖాయం!

ఏ దిశలో పెడితే మంచిది?

జమ్మి మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వాస్తు ప్రకారం దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని ఇంటికి దక్షిణం వైపున ఉండే బాల్కనీలో లేదా మిద్దె మీద పెంచుకోవడం చాలా ఉత్తమం. ఒకవేళ మీరు గుమ్మం బయట నాటాలనుకుంటే.. మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు అది మీకు కుడి చేతి వైపున ఉండేలా చూసుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్‌రూమ్ లేదంటే హాల్ లోపల ఉంచకూడదు. దీనికి ఆరుబయట గాలి, వెలుతురు తగిలితేనే మంచిది.

చేయకూడని తప్పులు:

Advertisement

జమ్మి పవిత్రమైన మొక్క కాబట్టి.. దీన్ని నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్క పక్కనే జమ్మిని ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే.. శివుడికి తులసికి అంతగా పడదు కాబట్టి, ఈ రెండింటినీ వేరువేరుగా ఉంచడమే పద్ధతి. అలాగే మొక్క చుట్టూ ఉన్న పరిసరాలను చాలా నీట్‌గా ఉంచుకోవాలి. పాత చెప్పులు, వాడని బట్టలు లేదా చెత్తాచెదారం మొక్క దగ్గర పడేయకూడదు. మనం ఎంత శుభ్రంగా ఉంచితే.. ఆ మొక్క నుంచి అంతటి సానుకూలత మనకు అందుతుంది.

కష్టాల నుంచి విముక్తి ఇలా..

మీకు ఏల్నాటి శని ప్రభావం ఉన్నా లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా.. ప్రతి శనివారం సాయంత్రం జమ్మి మొక్క దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించి చూడండి. ఇది మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని దూరం చేసి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు ఈ మొక్కను భక్తితో పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి అందరూ హాయిగా ఉంటారు. పద్ధతి ప్రకారం ఈ మొక్కను పెంచి చూస్తే.. మీ ఇంటిని అదృష్టం తప్పకుండా వరిస్తుంది.

Also Read: ఐఫోన్ వాడుతున్నారు సరే.. iPhoneలో iకి అర్థం తెలుసా మరి?

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×