BigTV English

Prabhas: గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభాస్ పెద్దమ్మ.. ఎందుకో తెలిస్తే షాక్!

Prabhas: గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభాస్ పెద్దమ్మ.. ఎందుకో తెలిస్తే షాక్!
Advertisement

Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మాత్రమే కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్ (Prabhas). తన నటనతో.. విలక్షణమైన వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులు దోచుకున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. వ్యక్తిగతంగా మాత్రం ఇంకా వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ప్రభాస్ కి ఒక తోడు కావాలని, ఆయనకు భార్య పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఏఐ ఫోటోలు కూడా సృష్టిస్తూ తృప్తి పడుతున్నారు.


గుడిలో ప్రభాస్ పెద్దమ్మ ప్రత్యేక పూజలు..

అటు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి (Shyamala Devi) కూడా అదిగో ఇదిగో అంటూ ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్లు చేస్తోంది కానీ ఇప్పటివరకు ఈయన పెళ్లిపై ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మీడియా కంటపడ్డారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో తలుపులమ్మ ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి ప్రభాస్ పేరిట విశేషమైన కుంకుమార్చన పూజ కూడా చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ప్రభాస్ పెళ్లి కోసమే శ్యామలాదేవి ఇలా కుంకుమార్చన చేయించారు అని, కనీసం అమ్మవారి దయతోనైనా ప్రభాస్ కి పెళ్లి జరుగుతుందేమో చూడాలి.


విడుదలకు సిద్ధమవుతున్న ది రాజా సాబ్..

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన నటిస్తున్న చిత్రం ‘ ది రాజా సాబ్’. ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో హార్రర్ కామెడీ జానర్ లో ఈ సినిమా రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో రిద్ధీ కుమార్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది.

ప్రభాస్ సినిమాలు..

ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతోపాటు.. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్, నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కల్కి సినిమా సీక్వెల్ కల్కి 2 చేస్తున్నారు. అలాగే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా రాబోతున్న సలార్ 2 సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఇక ఇలా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్.

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×