Mobile Recharge Rates| దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ యూజర్లకు గట్టి షాక్‌నిచ్చే వార్త!. జియో, ఎయిర్ టెల్ సహా అన్ని టెలికాం కంపెనీలు మరోసారి రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జాతీయ మీడియా ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మే నెలలో వరుసగా ఐదవ నెల కూడా నెట్ యూజర్ల సంఖ్య పెరగడంతో టెలికాం కంపెనీలు ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. దీంతో.. ఈ ఏడాది చివరి నాటికి మొబైల్ ఛార్జీలు 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం అంటే.. 2024 జూలైలో మొబైల్ కంపెనీలు తమ బేస్ ప్లాన్ ధరలను 11-23 శాతం పెంచాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తదుపరి ధరల పెంపు టైర్డ్ ధరల విధానంతో ఉండవచ్చు, ఇందులో డేటా అలవెన్స్‌ను గణనీయంగా తగ్గించి, కస్టమర్లను అదనపు డేటా ప్యాక్‌లు కొనుగోలు చేసేలా ప్రోత్సహించవచ్చు.
మొబైల్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం
మే నెలలో మొబైల్ యూజర్ల సంఖ్య 29 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది, యాక్టివ్ యూజర్లు సుమారు 1.08 ట్రిలియన్లకు చేరుకున్నారు. మార్కెట్ లీడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 5.5 మిలియన్ల యాక్టివ్ యూజర్లను సంపాదించి, తన మార్కెట్ వాటాను 150 బేసిస్ పాయింట్లు పెంచి 53 శాతానికి చేర్చింది. అదే సమయంలో, భారతి ఎయిర్‌టెల్ కూడా 1.3 మిలియన్ల కొత్త యాక్టివ్ యూజర్లను జోడించింది.
5G అభివృద్ధికి అనుగుణంగా ధరలు
ఇప్పుడు ధరలు 5G అభివృద్ధికి అనుగుణంగా సర్దుబాటు కానున్నాయి. బ్రోకరేజ్ సంస్థ జెఫెరీస్ ప్రకారం.. జియో మరియు ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య వేగంగా పెరగడం, వోడాఫోన్ ఐడియా యూజర్లను కోట్టడం వల్ల ధరలు పెంచేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రాబోయే ధరల సర్దుబాటు డేటా వినియోగం, స్పీడ్ లేదా సమయం వంటి అంశాల ఆధారంగా మారవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం.. టెలికాం కంపెనీలు మిడ్ మరియు ప్రీమియం కస్టమర్లను ఎక్కువగా టార్గెట్ చేస్తాయి, సామాన్య యూజర్లపై ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయి.
Also Read: డాక్టర్లు పదేళ్లుగా కనిపెట్టలేని ఆరోగ్య సమస్యను.. పది నిమిషాల్లో పరిష్కరించిన చాట్ జీపీటీ
స్టార్ లింక్ కు పోటీగా స్వదేశీ సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్.. హైదరాబాద్ కంపెనీ
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ అనే భారతీయ సంస్థ, స్వదేశీ సాటిలైట్‌లతో సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. ఇటీవల, ఈ సంస్థ IN-SPACe నుండి తన సాటిలైట్ సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందింది. అయితే స్టార్‌లింక్ ఇంకా ఇలాంటి అనుమతి కోసం వేచి ఉంది. 100 Gbps వేగాన్ని అందించే సామర్థ్యంతో, అనంత్ టెక్నాలజీస్ 4-టన్నుల జియోస్టేషనరీ (GEO) కమ్యూనికేషన్ సాటిలైట్‌ను ఆర్బిట్‌లోకి పంపేందుకు రూ. 3,000 కోట్ల ప్రారంభ పెట్టుబడిని ప్లాన్ చేస్తోంది.