E-Paper
Advertisement

14 ఏళ్లకే నరకం.. 450 సినిమాలు.. 35 ఏళ్లకే మిస్టరీ డెత్ ..దాగున్న చేదు నిజాలివే!

14 ఏళ్లకే నరకం.. 450 సినిమాలు.. 35 ఏళ్లకే మిస్టరీ డెత్ ..దాగున్న చేదు నిజాలివే!

Silk Smitha : ఇప్పుడంటే హీరోయిన్సే ఐటం సాంగ్స్ …అదే అదే స్పెషల్ సాంగ్స్ అంటూ ఆడిపాడేస్తున్నారు కాని ఒకప్పుడు ఈ సాంగ్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండేది. ముఖ్యంగా ఈ పాటలకోసమే టికెట్స్ తెగేవంటే ఆశ్చర్యం లేదు. అలాంటి స్పెషల్ సాంగ్స్ కి అప్పట్లో కేరాఫ్ గా నిలిచింది సిల్క్ స్మిత . అలా కేవలం 17 ఏళ్ల కెరీర్‌లో 450కి పైగా సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ స్టార్‌గా ఎదిగిన సిల్క్ అంతే వేగంగా జీవితాన్ని క్లోజ్ చేయడం విషాదం. మరి ఆ శృంగార భామ జీవిత చరిత్రని, అందులోని చీకటి కోణాలని క్విక్ గా చూసేద్దామా !

సిల్క్ స్మిత జననం 

1960 డిసెంబర్ 2న ఏలూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. బీద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి ఇంటి ఆర్దిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల కేవలం 10 ఏళ్ల వయసులోనే చదువు వదిలేయాల్సి వచ్చింది. ఆటపాటలతో గడపాల్సిన వయసులోనే, అంటే కేవలం 14 ఏళ్లకే ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. అయితే ఆ వివాహం ఆమె జీవితంలో ఒక పెద్ద నరకాన్ని మిగిల్చింది. అత్తమామల వేధింపులు, భర్త గృహహింసను భరించలేక, కేవలం 15 ఏళ్ల వయసులో ఏ దిక్కు లేకపోయినా ధైర్యం చేసి కట్టుబట్టలతో చెన్నైకి పారిపోయి వచ్చింది విజయలక్ష్మి.

మొదటి అవకాశం 

అయితే చెన్నై (అప్పుడు మద్రాస్)కి వచ్చిందన్న మాటే కాని అక్కడ తెలిసినవాళ్ళు ఎవరూ లేరు. దీంతో బతుకుతో పోరాటం చేసేందుకు సినిమా ఇండస్ట్రీలో హీరోయున్లకి మేకప్ వేసే ‘మేకప్ గర్ల్’గా తన కెరీర్ ని మొదలెట్టింది. అయితే అదే టైమ్ లో విజయ లక్ష్మిలో కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ, ఆమె టాలెంట్ ని పసిగట్టిన డైరెక్టర్ ఆంథనీ ఈస్ట్‌మ్యాన్ ‘ఇనయే తేడి’ చిత్రంతో ఆమెకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు విను చక్రవర్తి  ఆమెకు పరిచయం కావడంతో తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయిందనే చెప్పాలి. విను చక్రవర్తి సహాయంతో నటన, డ్యాన్స్, చివరికి ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకున్న విజయ లక్ష్మికి విను చక్రవర్తి ఒక గాడ్ ఫాదర్ లా మారిపోయాడు.

also read :ఉస్తాద్ డిజాస్టర్ దెబ్బకి రూటు మార్చిన పవన్ …ఈసారి పక్కాగా ప్లాన్ !

సిల్క్ గా మార్చిన సినిమా 

ఇక అదే సమయంలో అంటే 1979లో వచ్చిన ‘వండిచక్కరం’ సినిమా ఒక్కసారిగా విజయ లక్ష్మి కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన సిల్క్ అనే పాత్ర అప్పట్లో ఒక సెన్సేషన్. అలా ఆ సినిమా లో సిల్క్ అనే పాత్రతో విజయలక్ష్మి అనే పేరు పోయి ‘సిల్క్ స్మిత’గా మారిపోయింది. ఇక ఆ దెబ్బకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి స్టార్ గా నిలిచిపోయింది. ఆ క్రేజ్ ఎలా ఉండేదంటే అప్పట్లో చిరు  రజనీ, కమల్ వంటి స్టార్ హీరోల సినిమాలే సిల్క్ స్మిత డేట్స్ కోసం ఎదురుచూసేంతగా. ఇక ప్రొడ్యూసర్స్ అయితే సిల్క్ స్మిత స్టెప్ వేసిందంటే చాలు మా సినిమా మినిమం గ్యారంటీ అని నమ్మేంతగా. ఇక పోస్టర్ లపై హీరోలకి సమానంగా సిల్క్ స్మిత ఫోటో కూడా ప్రింట్ చేసేవారంటే స్మిత ఇండస్ట్రీని ఎంత షేక్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పోస్టర్స్ చూసే మాస్ ఆడియన్స్ సినిమా హళ్ళకి క్యూ కట్టేవారు మరి.

also read :ప్లాప్ డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ రిస్క్…వర్కౌట్ అయ్యేనా ?

ముంచిన నిర్మాణం 

అయితే కేవలం శృంగార బరితమైన మాస్ పెప్పీ సాంగ్స్, గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా ‘సీతాకోకచిలుక” వంటి సినిమాల్లో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. అయితే అలా సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ క్వీన్ లా దూసుకుపోతున్న సిల్క్ స్మిత లైఫ్ ఒక్కసారిగా డేంజరస్ టర్నింగ్ తీసుకుంది. అదే సినిమాలని ప్రొడ్యూస్ చేయడం. అవును అప్పటి వరకు సినిమాల్లో నటిస్తూ డబ్బులు వెనకేసిన సిల్క్ ఇపుడు డబ్బులు పంచాల్సిన పరిస్థితి. చేసిన సినిమాలు సక్సెస్ అయితే బాగానే ఉండేది. కాని SR సినీ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో బ్యానర్ స్థాపించి,రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్‌లతో ‘ప్రేమించి చూడు’ వంటి సినిమాల్ని తీసి చేతులు కాల్చుకుంది. ముఖ్యంగా తన పర్సనల్ సెక్రటరీని  నమ్మడంతో అతను ఆమెని మోసం చేసి , సినిమాలకు విచ్చలవిడిగా ఖర్చు చేయించి ఆమెను అప్పుల ఊబిలోకి  తొశాడు . దీనికి తోడు శ్రీహరి భార్య డిస్కో శాంతి హీరోయిన్‌గా తీసిన ‘వీర విహారం’ వంటి సినిమాలు  రిలీజ్ కాకపోవడం, పెట్టిన పెట్టుబడులన్నీ ఆవిరి అయిపోవడం సిల్క్ ని బాగా దెబ్బ తీశాయ్. ఇక చేసిన అప్పులని తీర్చడానికి తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని, ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డెత్ మిస్టరీ 

ఇలా ఒకవైపు సినిమాల్లో నష్టపోవడం, మరో వైపు పర్సనల్ లైఫ్ లో నమ్మిన వాళ్ళు దగ్గర లేక అనాధలా మిగిలిపోవడం ఆమెని బాగా కుంగదీశాయ్. దీనికి తోడు డిప్రెషన్ లోకి వెళ్ళిన సిల్క్ మద్యానికి బానిస అయిపొయింది. అయితే ఆమె ఎవరికీ తెలియకుండా ఒక డాక్టర్‌ను పెళ్లి చేసుకుందని, ఆయన సలహాతోనే తన కష్టార్జితాన్ని అంతా పోగొట్టుకుందని అప్పట్లో వార్తలు కూడా గట్టిగానే సర్క్యులేట్ అయ్యాయ్. మొత్తానికి అటు అప్పులు, ఇటు మానసికంగా ఒంటరి కావడం తో డిప్రెషన్ కి వెళ్ళిన సిల్క్ 1996 సెప్టెంబర్ 23న అంటే కేవలం 35 ఏళ్ల చిన్న వయసులో చెన్నైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక సూసైడ్ చేసుకున్నప్పుడు రాసిన లెటర్ లో తనని ఎవరు మోసం చేశారో, తన బాధ ఏంటో అంతా రాసినందన్న కథనాలు వచ్చాయ్ కూడా. అయితే ఇప్పటికీ సిల్క్ డెత్ ఒక మిస్టరీ అన్న వాళ్ళూ లేకపోలేదు. ఏది ఏమైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ పొందిన సిల్క్ స్మిత ఇలా చిన్న ఏజ్ లో సూసైడ్ చేసుకోవడం నిజంగా బాధాకరం.

also read :జానపద పదాల నుంచి వివాదాల వరకు.. సింగర్ మంగ్లీ ప్రస్థానం

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×