E-Paper
Advertisement

ఉస్తాద్ డిజాస్టర్ దెబ్బకి రూటు మార్చిన పవన్ …ఈసారి పక్కాగా ప్లాన్ !

ఉస్తాద్ డిజాస్టర్ దెబ్బకి రూటు మార్చిన పవన్ …ఈసారి పక్కాగా ప్లాన్ !
Advertisement

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా టైమ్ కేటాయించి చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లలో ‘ఓజీ’ తప్ప మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా ‘ఓజీ’ సూపర్ హిట్ అవ్వడంతో, ఆ తర్వాత వచ్చిన ‘ఉస్తాద్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్ వందల కోట్ల వసూళ్లు ఖాయమని భావించారు. కానీ, విడుదలైన మొదటి రోజే సినిమా భవిష్యత్తు ఏంటో క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. వందల కోట్లు అటుంచి, కనీసం వంద కోట్లు కూడా రాబట్టలేకపోయిందంటే హరీష్ శంకర్ సినిమాను ఎలా తీశాడో అర్థమవుతుంది. ఇలా ఊహించని షాక్ తగలడంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సినిమా మొదలవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో స్క్రిప్ట్ పూర్తవ్వాల్సిందేనని సురేందర్ రెడ్డికి హుకుం జారీ చేశాడు.

అమరావతిలో ఆఫీస్.. సురేందర్ రెడ్డిపై ఒత్తిడి!

అప్పుడెప్పుడో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు పట్టాలెక్కకపోవడానికి కారణం కథ పూర్తిగా రెడీ కాకపోవడమే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా స్టోరీని చకచక కంప్లీట్ చేయాలంటూ ఏకంగా అమరావతిలోనే ఒక ప్రత్యేక ఆఫీస్‌ను ఓపెన్ చేశారట. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ ప్రస్తుతం అక్కడే మకాం వేసి స్క్రిప్ట్ పనులు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఆ ఆఫీస్‌లో వాలిపోయి తనవైన సలహాలు, సూచనలు ఇస్తున్నాడట. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా ఈసారి పవన్ పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగబోతున్నాడన్న మాట.

Advertisement

also read:దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఊపిరి బిగబట్టే సస్పెన్స్! OTTలో మిస్ అవ్వకూడని 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

లుక్ మార్చారు.. గడ్డం పెంచారు.. ఎవరి కోసం?

Advertisement

కథ సంగతి ఇలా ఉంటే, పవన్ ఈ మధ్య గడ్డం పెంచుకుని కనిపిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇది సురేందర్ రెడ్డి సినిమా కోసమే అని కొంతమంది అంటుంటే, సుజిత్ దర్శకత్వంలో వచ్చే ‘OG 2’ సీక్వెల్ కోసమని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. భారీ ఆశలు పెట్టుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షాక్ ఇవ్వడంతో, ‘ఓజీ’ హైప్‌ని క్యాష్ చేసుకోవాలంటే పార్ట్ 2 వర్క్స్ స్పీడప్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడట. అంటే సూరి-వక్కంతంల స్క్రిప్ట్ ఏమాత్రం లేట్ అయినా, పవన్ వెంటనే ‘ఓజీ 2’ని పట్టాలెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.

సొంత బ్యానర్‌లో చిన్న సినిమాలు..

తన సొంత బ్యానర్ అయిన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ని యాక్టివేట్ చేసి, కేవలం తను నటించడమే కాకుండా చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. గతంలో త్రివిక్రమ్‌తో కలిసి ‘ఛల్ మోహన్ రంగ’ నిర్మించి చేతులు కాల్చుకున్న పవన్‌కు, ఈసారి అయినా నిర్మాణం అచ్చొస్తుందో లేదో చూడాలి. మొత్తానికి పాత పవన్ కల్యాణ్‌ను మరోసారి ఆడియన్స్‌కు పరిచయం చేయాలని పవర్ స్టార్ ఫిక్స్ అయ్యాడు. మరి పవన్ ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే!

also read:OTT Thriller: క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మలయాళీ ‘డైమండ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×