E-Paper
Advertisement

Singer Chinmayi: ప్రగతిపై ట్రోల్స్… మీ బతుక్కి.. అంటూ చిన్మయి వైరల్ పోస్ట్

Singer Chinmayi: ప్రగతిపై ట్రోల్స్… మీ బతుక్కి.. అంటూ చిన్మయి వైరల్ పోస్ట్
Advertisement

Singer chinmayi: సింగర్ చిన్మయి పరిచయం అవసరం లేని పేరు. సౌత్ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి తరచూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టలు కారణంగా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి గురించి మాత్రమే కాకుండా మహిళల గురించి ఎక్కడైనా, ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఆ ఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పోస్టులు చేస్తుంటారు . ఈ విధంగా చిన్మయి చేసే పోస్టులు కొన్నిసార్లు ఆమెను కూడా ఇబ్బందులలోకి నెట్టేస్తూ ఉంటాయి.

బంగారు, వెండి పథకాలు సాధించిన ప్రగతి…

చిన్మయి పోస్టులపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. వాటన్నింటినీ లెక్క చేయకుండా చిన్మయి మహిళలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇకపోతే తాజాగా సినీ నటి ప్రగతి(Pragathi) సాధించిన విజయాన్ని ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులో ఉన్న ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొంటూ సంచలనాలను సృష్టిస్తున్నారు తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నారు. ఈ పోటీలలో ఈమె ఒక బంగారు పతకంతో పాటు మూడు రజిత పథకాలను సాధించిన సంగతి తెలిసిందే.

ప్రగతికి మద్దతుగా చిన్మయి…

Advertisement

ఈ క్రమంలోనే ప్రగతి పట్ల పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు అయితే గతంలో ఈమె పట్ల ఎంతోమంది విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను పక్కన పెట్టే అనుకున్నది సాధించారు అంటూ ఒక నెటిజన్ ప్రగతి పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేశారు. ఇక ఈ విషయంపై సింగర్ చిన్మయి కూడా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సింగర్ చిన్మయి తన అధికారక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..

Advertisement

ప్రగతి గారి ఫోటోల గురించి అసభ్యకరమైన కామెంట్లు పెట్టినవారు వాళ్ల జీవితంలో ఏం సాధించారు? అలాంటివారు ఎప్పటికీ ఏమి సాధించలేరని తెలిపారు. అలాగే అమ్మాయిలకు ఈమె సలహా ఇస్తూ మీరంతా కూడా ప్రగతి గారి నుంచి స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళండి. మీపై వచ్చే చెడు కామెంట్లను తీసి పక్కన పడేయండి అలాగే మీరు భవిష్యత్తులో ఇలాంటి వారి కుటుంబంలోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి అంటూ ఈ సందర్భంగా చిన్మయి ప్రగతికి మద్దతుగా నిలబడటమే కాకుండా ఆమెపై విమర్శలు చేస్తున్న వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అలాగే అమ్మాయిలు కూడా ప్రగతిని చూసుకొని స్ఫూర్తిని పొందాలని తెలియజేస్తూ చిన్మయి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Actress Pragathi: డిప్రెషన్‌లో నటి ప్రగతి.. సినిమాల్లో అవకాశాల్లేవు, జిమ్ చేస్తే ట్రోల్స్ అంటూ కన్నీళ్లు

Related News

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

Big Stories

Advertisement
×