E-Paper
Advertisement

నాపై ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తున్నారు.. మంగ్లీ ఎమోషనల్ పోస్ట్!

నాపై ఉద్దేశపూర్వకంగానే కుట్రలు చేస్తున్నారు.. మంగ్లీ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Singer Mangli: సింగర్ మంగ్లీ ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ వివాదంలో చిక్కుకున్న మంగ్లీ (Mangli)పై ఇప్పటికే బాధితులు న్యాయం కావాలి అంటూ పోరాటం చేస్తున్నారు. సింగర్ మంగ్లీ పై అలాగే తనకు సంబంధించిన పలువురిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని , ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకి తనకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు..ఈ వివాదం కొనసాగుతున్న మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంలో తన ప్రమేయం లేదని తన తప్పు ఏమాత్రం లేదంటూ నిత్యం పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది . ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా మరోసారి తెలియజేశారు.

పనికట్టుకొని కుట్రలు చేస్తున్నారు..

ఇంస్టాగ్రామ్ వేదికగా మంగ్లీ ఈ విషయంపై స్పందిస్తూ మైక్రో ఫైనాన్స్ సుభాక్షేత్ర ఇన్ఫ్రా మోసంలో బాధితులకు న్యాయం జరిగింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నాను. బాధితులకు న్యాయం జరిగే వరకూ వాళ్లకు అండగా ఉంటానని గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. ఈ ఆర్థిక మోసంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా చెబుతున్న కానీ ఈ వ్యవహారాన్ని కొత్తపల్లి ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు శక్తులు నాపై పని కట్టుకొని కుట్రలు చేస్తున్నారు. నిరాదరణమైన ఆరోపణలు చేస్తున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి దుష్ప్రచారం చేస్తున్నారు. న్యాయవ్యవస్థ పై చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం గౌరవం ఉంది అంటూ మంగ్లీ తెలిపారు.

సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..

Advertisement

ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో భాగంగా తన గురించి వస్తున్న ఆరోపణలలో నిజం లేదని తాను నిజం చెబుతున్న ఎవరు నమ్మడం లేదని తెలిపారు అలాగే ఉద్దేశం పూర్వకంగానే కుట్రలు చేస్తున్నారని ఈమె ఆవేదన చెందారు. గతంలో కూడా మంగ్లీ ఈ అంశం గురించి మాట్లాడుతూ తాను ఎవరిని కలవలేదని, ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి డబ్బులు తీసుకోలేదని, అలా తీసుకున్నట్టు నిరూపిస్తే తానేం చేయడానికి అయినా సిద్ధమేనని తెలిపారు. ఇక సింగర్ మంగ్లీ గురించి అడ్వకేట్ సుబ్బారావు కేసు వేయడంతో ఆయనపై కూడా ఈమె కేసు నమోదు చేశారు.

Advertisement

తనకు సుబ్బారావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదని ఈమె ఈ విషయంపై ఆవేదన చెందారు. అయితే ఇప్పటికే ఎంతోమంది తాము మైక్రో ఫైనాన్స్ బాధితులమని సింగర్ మంగ్లీ పేరు చెబితేనే డబ్బులు ఇచ్చామని, స్వయంగా సింగర్ మంగ్లీ ఇంటికి వెళ్లి తాము డబ్బులు ఇచ్చాము అంటూ పలువురు బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మంగ్లీ మాత్రం ఈ కేసుకి తనకు సంబంధం లేదని తెలిపారు. మరి ఈ వ్యవహారం ఇలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది తెలియాల్సి ఉంది. ఈ కేసు విభాగంలో సింగర్ మంగ్లీ తప్పు చేశారని నిరూపిస్తే ఈమెపై ఇండస్ట్రీ వేటు వేయబోతుందని, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది.

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×