BigTV English

Suchi Leaks : బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్.. ఎమోషనల్ పోస్ట్…

Suchi Leaks : బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్.. ఎమోషనల్ పోస్ట్…

Suchi Leaks : తమిళ సింగర్ సుచిత్ర (Suchitra) ‘సుచి లీక్స్’ (Suchi Leaks) పేరుతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఎప్పుడు చూసినా ఈమె ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేయడం, అది హాట్ టాపిక్ గా మారడం చూసాం.. కానీ తాజాగా తాను దారుణంగా మోసపోయానని ఓ వీడియోను షేర్ చేసింది. అందరిని తన నోటితో చెడుగులాడుకునే ఈమె ఇలా మోసపోయింది అంటే కొందరు నమ్మశక్యంగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన ఇండ్లు డబ్బులు అన్ని తీసుకుని మోసం చేశారంటూ ఆ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్ అవుతుంది.


దారుణం మోసపోయిన సింగర్.. 

ఇండస్ట్రీలో కాంట్రవర్సీ లేడీ సింగర్ గా పేరు తెచ్చుకున్న సుచిత్ర (Suchitra) మ్యూజిక్ డైరెక్టర్ శక్తి ఆర్ సెల్వను ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించింది. అంతటితో ఆగకుండా ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా ఆమె నోరు పారేసుకుంటూ వచ్చింది. కొందరు స్టార్ హీరోలపై రెచ్చిపోయి మరి వీడియోలు పెట్టింది. దాదో ఒక్కసారిగా హీరోయిన్ మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఒక వైపు తనపై విమర్శలు ఎదురవుతున్న సరే తాను మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ఇది అంటూ లీక్ చేసేది. అలాంటి ఈమె ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయానంటూ కన్నీళ్లు పెట్టుకుండు. ఓ వీడియోని రిలీజ్ చేసింది.


ఆ వీడియోలో మాట్లాడుతూ… నేను రెండో పెళ్లి చేసుకోబోయే దానికి రెడీ అయ్యాను. అంతా బాగానే ఉంది అని అనుకునే లోపల ఆ వ్యక్తి నన్ను దారుణంగా మోసం చేసి నా ఇల్లు డబ్బులు ఆస్తులు అన్ని లాగేసుకున్నాడు. నన్ను నిలువునా ముంచేసాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అతన్ని కోర్టు కు లాగుతా అంటూ ఆమె అంటుంది. ఆ వీడియో వైరల్ అవడంతో నెట్టిజెన్లు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

?igsh=MWRoemFtZDAyc2szdA==

సుచిత్ర సాంగ్స్.. 

నిజానికి గత కొంతకాలంగా సుచీ లీక్స్ వివాదంతో సుచిత్ర పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఓ వెలుగు వెలిగిన సుచిత్ర (Suchitra) ‘సుచి లీక్స్’ రేపిన వివాదం తర్వాత.. ఆమె జీవితం తారుమారు అయింది. తనకు మంచి పేరు ఉందనే  కారణంతో, తన పేరు, ఫోటో ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు అంటూ సుచిత్ర షరతు విధించింది. కే బాలచందర్, కార్తీక్ రాజా, వైరా ముత్తు వంటి వారిపై ఆమె అనే ఆరోపణలు చేసింది. గత కొన్నేళ్ల నుంచి ఆమెకు అసలు అవకాశాలే లేవు. ఈ క్రమంలోనే ఆమెకు అవకాశం ఇచ్చి, అందరూ మర్చిపోయారు.. అప్పుడప్పుడు ఈమె ఇండస్ట్రీలోని హీరోలపై చేసే కామెంట్స్ ఎంతగా వైరల్ అవుతాయో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తానే వైరల్ గా మారింది.. మరి దీన్ని ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. ఏది ఏమైనా కూడా సింగర్ సుచిత్ర ప్రస్తుతం దారుణమైన స్థితిలో ఉందని అర్థమవుతుంది.

Related News

Toolywood: వినాయక చవితి.. పండుగ వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు, పోస్ట్స్ వైరల్

Benz Movie: లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి మరో స్టార్ హీరో.. !

Jayammu Nischayammu raa: నాని క్లాస్ లో అలాంటి పని చేసేవాడా..బిగ్ సీక్రెట్ బయటపెట్టిన టీచర్!

OG Suvvi Suvvi Song: ఏంటీ ఓజీ సువ్వి సువ్వి సాంగ్ కూడా కాపీనా..ఇలా దొరికిపోయావ్ ఏంటీ తమన్!

Prakash Raj: ప్రధాని మోడీపై సెటైర్లు పేల్చిన ప్రకాష్ రాజ్.. సిగ్గుపడాల్సిన పనిలేదంటూ!

Big Stories

×