Jabardast Vinod : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్ లైఫ్ మారిపోయింది. ఈ షో ద్వారా పేరు తెచ్చుకున్న చాలామంది ఇప్పుడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొందరేమో డైరెక్టర్లుగా ప్రొడ్యూసర్లుగా మారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి అతిపెద్ద ఫ్లాట్ఫారంలో తన టాలెంట్ నిరూపించుకొని కమెడియన్గా పేరు తెచ్చుకున్న వారిలో వినోద్ ఒకరు. ఈ షోలో లేడీ గెటప్ వేసుకొని వినోదినిగా నవ్వులు పూయించే వినోద్.. లైఫ్‌లో చాలా కష్టాలు పడ్డాడు. ఈ విషయాలు ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో తన గురించి ఎన్నో విషయాలను షేర్ చేసి కన్నీళ్లు పెట్టించాడు వినోద్. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సూసైడ్ చేసుకోవాలనుకున్నా..
బుల్లితెరపై ప్రసారమవుతున్న మరో కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా వదిలారు. ఆ ప్రోమోలో షో కి చాలామంది తమ భార్యలతో వచ్చారు. ఇక కమెడియన్ వినోద్ కూడా తన భార్యతో ఆ షోకు వచ్చాడు. ఈ సందర్భంగా పెట్టిన తులాభారం టాస్కులో తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఇక ఎపిసోడ్ చివరిలో తన గతం గురించి చెప్పుకొని వినోద్ ఎమోషనల్ అయ్యాడు. డెత్ బెడ్ మీద ఉన్న నేను ఎందుకు అందరికీ భారంగా ఉండాలి చనిపోవాలని బ్లేడ్ని తలకింద పెట్టుకొని పడుకున్నా అంటూ తన గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు వినోద్. ఈ మాట వినగానే ఇంద్రజ సహా అక్కడున్నవాళ్లు అవాక్కయ్యరు. తన భార్య ఏం మాట్లాడకండా అలా సైలెంట్‌గా ఉన్నారు. తన గతం గురించి చెప్పి అందరినీ ఏడిపించాడు వినోద్. ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా మారనుంది..
Also Read: బాయ్ ఫ్రెండ్ చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్.. ఎమోషనల్ పోస్ట్…
వినోద్ పై దాడి..
గత కొన్నేళ్ల క్రితం ఓ ఇంటి తగాదా విషయంలో వినోద్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాను ఉంటున్న ఇంటినే కొనుక్కోవాలని ఓనర్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే డబ్బులు తీసుకున్న ఆ ఓనర్ ఇంటిని అమ్మేందుకు నిరాకరించాడు.. పోనీ అడ్వాన్స్ డబ్బులు అయినా తిరిగి ఇవ్వమని అడిగితే ససేమీరా అన్నాడని వినోద్ గతంలో చెప్పాడు. దాంతో తను మోసపోయినట్లు గ్రహించి ఇక డబ్బులు వస్తాయో రావు అనే టెన్షన్లో చచ్చిపోవాలని అనుకున్నాను అంటూ తన ఎమోషనల్ స్టోరీ ని అందరితో పంచుకున్నాడు. ఇక ప్రస్తుతం వినోద్ జబర్దస్త్ లో స్కిట్లలో సందడి చేస్తున్నాడు. మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నాడు.. అంతేకాదు పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా వినోద్ వినోదినిగా మీద మారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పండగ ఈవెంట్లలో కూడా స్కిట్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటాడు.