Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని అతిధి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. పెట్టుబడి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజు ఆఫీసులో మీరు ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. క్రొత్త కాంటాక్టులు తీసుకోండి. క్రొత్త పరిచయాలు పెంచుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు అన్నివిధాలా సాయపడుతారు. లక్కీ సంఖ్య: 9
వృషభ రాశి:
మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి. ఈరోజు మీరు డబ్బు విలువ తెలుసుకుంటారు. మీ అవసరాలకు డబ్బు అందదు. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు మీకు స్పెషల్‌గా గడుస్తుంది. లక్కీ సంఖ్య: 8
మిథున రాశి:
మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు. మీ ప్రేమ జీవితపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. మీయొక్క అన్ని పనులు పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో గడపండి. దీని వల్ల మీరు ఈ రోజు కొత్త అనుభూతిని పొందుతారు. లక్కీ సంఖ్య: 6
కర్కాటక రాశి:
ఆధ్యాత్మికత విషయాలలో పాల్గోంటారు. మత్తు పానీయాలకు దూరంగా ఉండండి లేదంటే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగులకు ఆఫీసులో సుహృదయమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. లక్కీ సంఖ్య: 1
సింహరాశి:
ఈరోజు వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వారి ద్వారా క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. గోప్ప వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. మీ శ్రీమతి తరఫు బంధువుల రాక వల్ల మీ రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని ప్రాజెక్టులు వాయిదా పడతాయి. లక్కీ సంఖ్య: 8
కన్యారాశి :
ఈరోజు మీరు బాడీ పెయిన్స్ తో బాధపడే అవకాశం ఉంది. ధన సంపాదన మీద ఆలోచన చేస్తారు. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు బాధపడతారు. మీ పనులను ఇతరులతో చేయించకండి. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి లబ్ది చేకురుస్తాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం. లక్కీ సంఖ్య: 7
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి:
క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానాకి హాని కలిగించవచ్చును. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకొండి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు కోపాన్ని అధిగమించాలి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీ జీవిత భాగస్వామే మీ నిజమైన దేవత అన్న వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. లక్కీ సంఖ్య9
వృశ్చికరాశి:
ఈరోజంతా మీకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. వ్యాపారంలో భాగస్వాములు మీ ఆలోచనలను ప్రోత్సహిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో పై అధికారుల మాటలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. మీ జీవిత భాగస్వామి వల్ల ఆనందకర క్షణాలు గడుపుతారు. లక్కీ సంఖ్య: 2
ధనస్సు రాశి:
మీ సమస్యల పరిష్కారం కోసం ఎవరేం చెప్పినా వినండి. తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయము దొరకడము కష్టమవుతుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో ఒక విషయంలో అనుమానంగా ఉంటారు. రోజు చివరికల్లా మీ తప్పు మీరు తెలుసుకుంటారు. లక్కీ సంఖ్య: 8
మకరరాశి:
మీరు మీయొక్క ఖాళీ సమయాన్నిఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముక్కసూటిగా మాట్లాడటంతో బంధువులతో విరోధం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి వారితో మనసు విప్పి మాట్లాడండి. లక్కీ సంఖ్య: 8
కుంభరాశి:
మీ వృధా ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి. బంధువులు మీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. ప్రేమికులకు నిరాశ ఎదురవుతుంది. ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మిమ్మల్ని ఆఫీసులో మీకు ఉపయోగపడుతుంది. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు సాయం చేస్తారు. లక్కీ సంఖ్య: 6
మీనరాశి:
మీ ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం మీద దృష్టి పెట్టండి. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందమగా ఉండాలి అనుకుంటే మూడో వ్య్తక్తి మాటలు నమ్మవద్దు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. లక్కీ సంఖ్య: 3
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే