E-Paper
Advertisement

జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!

జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!
Advertisement

Slumdog Teaser : ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’.. పూరీ జగన్నాథ్ మరియు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుండి మరో సాలిడ్ అప్ డేట్ వచ్చేసింది.యస్ …ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.విషయంలోకి వెళ్తే ..పూరీ జగన్నాథ్ మార్క్ రగ్గడ్ క్యారెక్టరైజేషన్, విజయ్ సేతుపతి వెర్సటైల్ యాక్టింగ్ వెరసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ క్రమంలో జూన్ 8వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం యొక్క అఫీషియల్ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ అండ్ బ్లడీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ పోస్టర్ రివీల్ అవడంతో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశంలో పెట్టేసింది.

‘రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్‌లెస్ ఎమోషన్స్

పూరీ కనెక్ట్స్ మరియు జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఛార్మి కౌర్ సమర్పణలో పూరీ జగన్నాథ్, జెబి నారాయణరావు కొండ్రొల్ల కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి.ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే, పూరీ జగన్నాథ్ తన వింటేజ్ మాస్ స్టైల్‌ను ఈ సినిమాతో మళ్లీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ పోస్టర్‌లో హీరో విజయ్ సేతుపతి వెనుక వైపు తిరిగి నిలబడి, కళ్లకు నల్లటి గుడ్డ కట్టుకుని, చేతిలో రక్తం తో ఒక పదునైన కత్తిని తల వెనుక పట్టుకుని ఉన్నలుక్ అత్యంత భీకరంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పొగలు కమ్ముకున్న వాతావరణం, లైటింగ్ ఎఫెక్ట్స్ సినిమాలోని ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో హింట్ ఇస్తున్నాయి. మురికివాడల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ క్రైమ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని పూరీ తెరకెక్కిస్తున్నారని, ‘రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్‌లెస్ ఎమోషన్స్’ అనే ట్యాగ్‌లైన్ ఈ కథ యొక్క ఇంటెన్సీ ని చూపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల మాట.

నటీనటుల విషయానికి వస్తే

Advertisement

ఇక ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే ఇందులో విజయ్ సేతుపతి సరసన టాలెంటెడ్ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఇక వెటరన్ బ్యూటీ టబు సినిమాలో కీ రోల్ పోషించనుందని,అలాగే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, విటివి గణేష్ కూడా ఈ చిత్రంలో భాగమయ్యారని సమాచారం.
గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి పూరీ ఏకంగా విజయ్ సేతుపతితో జతకట్టడంతో ఈ కాంబో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని నమ్ముతున్నారు పూరి ఫ్యాన్స్.
ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తుండటంతో, పూరీ మార్క్ డైలాగ్స్ అండ్ యాక్షన్ సీన్స్‌కు ఆయన అందించే BGM పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

రాంపేజ్ టీజర్ ఎన్ని సంచలనాలకి తెర తీస్తుందో

‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రీ-రికార్డింగ్ మరియు ఫైనల్ ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా జూన్ 8న విడుదల కాబోయే టీజర్‌తో పాటే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని ఇన్ సైడ్ టాక్.చూడాలి మరి జూన్ 8న సాయంత్రం 6 గంటలకు రాబోతున్న ఈ మాస్ రాంపేజ్ టీజర్ ఎన్ని సంచలనాలకి తెర తీస్తుందో !
also read :పెద్ది’ ఆడియన్స్‌పై ఉపాసన సీరియస్ వార్నింగ్..అసలేమైందంటే?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×