E-Paper
Advertisement

పెద్ది’ ఆడియన్స్‌పై ఉపాసన సీరియస్ వార్నింగ్..అసలేమైందంటే?

పెద్ది’ ఆడియన్స్‌పై ఉపాసన సీరియస్ వార్నింగ్..అసలేమైందంటే?

Upasana Reaction: ‘పెద్ది’…టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నిన్నఅనగా జూన్ 4, 2026 గురువారం నాడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సరికొత్త రికార్డులను తిరగరాసే పనిలో పడింది.
ఉప్పెన లాంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సనా శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని, పక్కా లోకల్ నేటివిటీతో ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ కంటెంట్‌ను ప్రెజెంట్ చేసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, నార్త్ ఇండియా మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద మాంచి ఫెస్టివల్ మూడ్ కనిపిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం అంచనాలు ఆకాశాన్ని అంటేస్తున్నాయ్.

 అరుస్తూ హంగామా సృష్టించిన ఫ్యాన్స్ 

అయితే బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఇలా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ థియేటర్ లో జరిగిన ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల నిన్న స్వయంగా థియేటర్‌కు వెళ్లి సాధారణ అభిమానులతో కలిసి ఈ సినిమాను చూశారు.మెగా పవర్ స్టార్ మాస్ పర్ఫార్మెన్స్‌ను వెండితెరపై చూసేందుకు వచ్చిన ఉపాసనకు థియేటర్ వద్ద ఘనస్వాగతం లభించింది కూడా.సినిమా స్క్రీనింగ్ అవుతున్న సమయంలో థియేటర్‌లో అభిమానులు ఓ రేంజ్ లో హడావుడి చేశారు.అంతా బాగానే ఉంది కాని స్క్రీన్‌పై చరణ్ ఎంట్రీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ వస్తున్న సమయంలో కొందరు అభిమానులు విపరీతమైన అల్లరి చేస్తూ, హద్దులు దాటి గట్టిగా అరుస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఉపాసన ఆ హడావుడి, అల్లరి వల్ల కొంత అసహనానికి గురైనట్లు స్పష్టమవుతోంది.

ఫైర్ అయిపొయిన ఉపాసన 

థియేటర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన ఆమె.. అతిగా ప్రవర్తిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కొందరు వ్యక్తులపై అక్కడికక్కడే ఫైర్ అయిపొయింది. సైలెంట్‌గా ఉండి సినిమా చూడాలంటూ సీరియస్‌గా వారించిన ఈ విజువల్స్ మరియు దీనికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

ఈ సంఘటనను పక్కన పెడితే.. ‘పెద్ది’ మూవీలోని కంటెంట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక సాధారణ యువకుడు క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగాడు, ఆ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సామాజిక, రాజకీయ సవాళ్లు ఏంటనే పాయింట్‌ను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు బుచ్చిబాబు.

ఈ పెద్ది ఏ నంబర్స్ దగ్గర ల్యాండ్ అవుతాడో 

ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. ఆమె నటనకు, తెలుగు డైలాగ్స్ పలికిన విధానానికి ప్రశంసలు దక్కుతున్నాయి. సీనియర్ నటుడు జగపతి బాబు పవర్‌ఫుల్ విలనిజం, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పోషించిన కీలక పాత్ర సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గతేడాది విడుదలైన దేవర తర్వాత జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇది మరో భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం.చూడాలి మరి నార్త్ బెల్ట్‌లో కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతున్న ఈ పెద్ది ఏ నంబర్స్ దగ్గర ల్యాండ్ అవుతాడో !

also read :‘పెద్ది’ టీమ్‌కు షాకిచ్చిన జాన్వీ కపూర్…అచ్చియమ్మ నిజంగానే హర్ట్ అయిందా?

Related News

జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!

‘పెద్ది’ టీమ్‌కు షాకిచ్చిన జాన్వీ కపూర్…అచ్చియమ్మ నిజంగానే హర్ట్ అయిందా?

‘దూత 2’ షురూ.. కింగ్ నాగార్జున క్లాప్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైన నాగచైతన్య మోస్ట్ అవేటెడ్ సీక్వెల్

‘రాజా శివాజీ’ సక్సెస్ పార్టీలో రచ్చ.. నెటిజన్ల ఫైర్.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన స్టార్ హీరో!

‘పెద్ది’ బాక్సాఫీస్ విధ్వంసం.. అంతలోనే లీక్ చేసిన సైబర్ నేరగాళ్లు!

బయ్యర్లకు డబ్బులు ఇచ్చేసిన నిర్మాత.. ‘జన నాయగన్ ‘మూవీ రిలీజ్ లేనట్లేనా..?

పాలిటిక్స్ లోకి కోలీవుడ్ హీరో ఎంట్రీ.. ఉపఎన్నికల్లో పోటీ..

Big Stories

×