Sobhita-Naga Chaitanya Wedding Anniversary: నాగ చైతన్య-శోభితల దూళిపాళ పెళ్లి బంధానికి ఏడాది. ఈ రోజు వారి పెళ్లి రోజు. గతేడాది డిసెంబర్ 4న శోభిత-నాగచైతన్యలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శోభిత భర్తకి స్పెషల్ విషెస్ తెలుపుతూ పెళ్లి వీడియో షేర్ చేసింది. పెళ్లిలో వీరిద్దరు చెప్పుకున్న ఊసులు, అల్లరి, అక్కినేని ఫ్యామిలీ మధ్య పండుగలా జరిగిన వీరి వివాహ మహోత్సపు మధుర గుర్తులను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ వీడియో శోభిత మాట్లాడుతూ.. “ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాకే మనం పరిపూర్ణం అవుతామన్నది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, తను (నాగ చైతన్య) లేకుండ నేను పరిపూర్ణం కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ‘శోభిత వచ్చాక నా జీవితం పూర్తిగా మారిపోయింది. పొద్దున లేచాక నా మొదటి ఆలోచన రాత్రి పడుకునే ముందు నా చివరి ఆలోచన తనే’ అంటూ నాగ చైతన్య సైతం శోభితపై ప్రేమ కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్, అక్కినేని ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. వారి పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ చిరునవ్వులు, ఆనందోత్సహాలు ఆ పెళ్లి పందిరి వెల్లువిరిసింది.
కాగా గతేడాది 2024 డిసెంబర్ 4న హిందూ సంప్రదాయ పద్దతిలో శోభిత-నాగ చైతన్య (Naga Chaitanya Sobhita Wedding Anniversary) పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతికొద్ది మంది సినీ ప్రముఖులు, నటీనటులు మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేశారు. నేడు తమ మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత పెళ్లి వీడియో షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఈ వీడియోకి శోభిత ఇలా క్యాప్షన్ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత జీవితంతో పాటు తన భర్త నాగచైతన్య గురించి ఇప్పటికే ఆమె పలు విశేషాలను మీడియాతో పంచుకుంది.
తాజాగా ఈ వీడియో షేర్ చేస్తూ.. నేను ఎంతో ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేసి ఏడాది పూర్తి అయింది. నాగచైతన్య తన లైఫ్‌లోకి వచ్చాకే జీవితం పరిపూర్ణమైంది. అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్లుగా.. శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తి అయింది’ అంటూ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. దీంత వీరికి ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌లో నాగ చైతన్య శోభితలు గతేడాది ఆగష్టులో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని ఆఫీషియల్‌గా ప్రకటించారు. సడెన్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ అంత సర్‌ప్రైజ్ అయ్యారు. ఇక అదే ఏడాది డిసెంబర్ 4న వీరు పెళ్లి బంధంతో వైవాహకి జీవితంలోకి అడుగుపెట్టారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==