E-Paper
Advertisement

Sobhita: నాగచైతన్య బర్త్ డే.. శోభిత క్యూట్ విషెస్.. లవర్ అంటూ!

Sobhita: నాగచైతన్య బర్త్ డే.. శోభిత క్యూట్ విషెస్.. లవర్ అంటూ!
Advertisement

Sobhita: శోభిత పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న శోభిత అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు నాగచైత నేను ప్రేమించి గత ఏడాది వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తరువాత మొదటిసారి నాగచైతన్య శోభితతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇలా నాగచైతన్య పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

హ్యాపీ బర్త్ డే లవర్…

ఈ క్రమంలోనే శోభిత సైతం తన భర్తకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నాగచైతన్యతో శోభిత కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..” హ్యాపీ బర్త్ డే లవర్” అంటూ చాలా క్యూట్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం శోభిత చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో అభిమానులు సైతం నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నాగచైతన్యకు శోభిత రెండవ భార్య అనే సంగతి అందరికీ తెలిసిందే. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెతో విడిపోయిన తర్వాత శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

శోభితతో మొదటి పుట్టినరోజు..

Advertisement

శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫ్ చాలా హ్యాపీగా ఉందని ఎన్నో సందర్భాలలో నాగచైతన్య తన భార్యపై ప్రశంసలు కురిపించారు. ఇక శోభిత నాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉన్నారు . ఇక నాగచైతన్య సినిమా విషయానికి వస్తే ఇటీవల ఈయన తండేల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement

ఇక నాగచైతన్య పుట్టినరోజు కావడంతో నేడు నాగచైతన్యకు సంబంధించి ఈ సినిమా టైటిల్ విడుదల చేశారు . ఈ సినిమాకి “వృషకర్మ” అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది .ఈ టైటిల్ తో పాటు నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా మైథాలజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈమె దక్ష అనే పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్లు అధికారకంగా నిర్మాతలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

Also Read: HBD Anil Ravipudi: అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్… విద్యా రంగంలోకి స్టార్ డైరెక్టర్!

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×