E-Paper
Advertisement

Viral Video: టైమ్‌కు ఆఫీస్‌కు రావాలన్న బీహారీ బాస్.. దారుణంగా కొట్టించిన మరాఠీ మహిళ!

Viral Video: టైమ్‌కు ఆఫీస్‌కు రావాలన్న బీహారీ బాస్.. దారుణంగా కొట్టించిన మరాఠీ మహిళ!
Advertisement

గత కొంత కాలంగా మహారాష్ట్రలో ఉండేవారికి మరాఠీ రావాల్సిందే అనే ఓ డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా రాజ్ థాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) ఈ డిమాండ్ ను బలంగా తీసుకెళ్తుంది. అందులో భాగంగానే తాజాగా ఓ బీహారీ కంపెనీ యజమానిపై ఆయన పార్టీకి చెందిన కొంత మంది గూండాలు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బీహార్ కు చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రలో కంపెనీ ఏర్పాటు చేశాడు. చాలా కాలంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా మహారాష్ట్ర, మరాఠీ లొల్లి పెరిగిన నేపథ్యంలో చాలా మంది స్థానికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నవ్యక్తుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఓ ఆఫీస్ లో పని చేస్తున్న మహిళ గత కొద్ది రోజులుగా సరైన సమయానికి ఉద్యోగానికి రావడం లేదు. ఎందుకు టైమ్ కు రావడం లేదని యజమాని ప్రశ్నించారు. అయితే, సదరు మహిళ తాను బీహారీ వ్యక్తి మాటలు వినాల్సిన అవసరం లేదని, తనకు నచ్చిన సమయానికి వస్తానంటూ అడ్డదిడ్డంగా వాదించింది. టైమ్ కు రాకపోతే, ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదని సదరు యజమాని తేల్చి చెప్పాడు.

యజమానిపై MNS గూండాల దాడి

Advertisement

సదరు మహిళ వెళ్లి తనపై బీహారీ యజమాని అనుచితంగా వ్యవహరిస్తున్నాడంటూ MNS కార్యకర్తలకు చెప్పింది. వెంటనే ఓ గుంపును తీసుకొని ఆఫీస్ మీదికి వచ్చింది. అసలు విషయం ఏంటని అడగకుండానే, MNS గూండాలు సదరు యజమాని మీద దాడికి పాల్పడ్డారు. చెంపమీద, వీపు మీద కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో సదరు బీహారీ యజమానిని పసుపు రంగు డ్రెస్సులు ధరించిన MNS కార్యకర్తలు బెదిరిస్తున్నట్లు, భయపెడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: రైలు కదిలినా డబ్బులివ్వలేదు.. పరిగెట్టి పరిగెట్టి కన్నీళ్లు పెట్టుకున్న చిరు వ్యాపారి!

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు  

అటు ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా మహారాష్ట్రకు చెడ్డ పేరు వస్తుందన్నారు. “మహారాష్ట్రలో కొంతమంది వ్యక్తులు మరాఠీ పేరుతో వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటున్నారు. వారి కారణంగా మరాఠీల ప్రతిష్ట దెబ్బతింటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి.. గుజరాత్ నుంచి అస్సాం వరకు, ఎవరి భాష వాళ్లు మాట్లాడుకుంటారు. ఎవరూ ఎవరిని ఆపడానికి వీల్లేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.  “ఇలాగే చేస్తే మహారాష్ట్రలో ఉన్న ఇతర రాష్ట్రాల కంపెనీలు త్వరలోనే ప్యాకప్ చెప్పడం ఖాయం. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పోవడం పక్కా. ఇప్పటికైనా భాష పేరుతో అతిచేయడం మానుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పలువురు సీరియస్ అవుతున్నారు.

Read Also:  రైలులో మ్యాగి వండిన మహిళ.. అడ్డంగా బుక్కైందిగా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×