E-Paper
Advertisement

Kalki 2: కల్కి2లో గ్లోబల్ బ్యూటీ.. వారణాసి క్రేజ్ బాగానే వాడుతున్నారే?

Kalki 2: కల్కి2లో గ్లోబల్ బ్యూటీ.. వారణాసి క్రేజ్ బాగానే వాడుతున్నారే?
Advertisement

Kalki 2: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటి దీపికా పదుకొనే (Deepika Padukone)నటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ సినిమాలో మాత్రం దీపికా పదుకొనే నటించడం లేదంటూ నిర్మాతలు అధికారకంగా వెల్లడించారు.

దీపికా స్థానంలో ప్రియాంక?

ఇలా ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేని తప్పించడంతో తదుపరి కల్కి 2 (Kalki 2)సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క నటించబోతున్నారని సాయి పల్లవి నటించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త చక్కర్లు కొడుతుంది. కల్కి 2 సినిమాలో దీపికా పదుకొనే స్థానంలో ప్రియాంక చోప్రాను(Priyanka Chopra) తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

కల్కి 2 కోసం ప్రియాంక చోప్రా?

Advertisement

దీపిక పదుకొనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు.. ఇలాంటి తరుణంలోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దీపిక సరైన ఎంపిక అని భావించారు కానీ కొన్ని కారణాల వల్ల సీక్వెల్ సినిమా నుంచి తప్పించారు. అయితే గ్లోబల్ రేంజ్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి ప్రియాంక చోప్రాను కల్కి 2 లో భాగం చేస్తే సినిమాకు గ్లోబల్ రేంజ్ లో ఆదరణ లభిస్తుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

స్పిరిట్ పనులలో బిజీగా ప్రభాస్..

Advertisement

ఇలా వారణాసి ద్వారా బాగా ట్రెండింగ్ లో ఉన్న ప్రియాంక చోప్రాను కల్కి 2 సినిమాలో భాగం చేస్తే ఈ సినిమాకి కూడా గ్లోబల్ రేంజ్ లో అదే ఆదరణ వస్తుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. మరి కల్కి సినిమా కోసం ప్రియాంక చోప్రాను సంప్రదించారని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు మరింత ఆలస్యం అవుతాయని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు, ఇవన్నీ పూర్తి అయిన తరువాతనే కల్కి2, సలార్ 2 పనులు ప్రారంభం కానున్నాయి.

Also Read: Samantha Marriage: సమంత రెండో పెళ్లి..2026 లో జరిగేది ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన జ్యోతిష్యుడు?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×