E-Paper
Advertisement

Samantha Marriage: సమంత రెండో పెళ్లి..2026 లో జరిగేది ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన జ్యోతిష్యుడు?

Samantha Marriage: సమంత రెండో పెళ్లి..2026 లో జరిగేది ఇదే.. షాకింగ్ విషయం చెప్పిన జ్యోతిష్యుడు?
Advertisement

Samantha Marriage: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత(Samantha) రెండో వివాహం గురించి పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సమంత పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది జ్యోతిష్యులు కూడా సమంత రెండో పెళ్లి గురించి ఆమె తదుపరి జీవితం గురించి మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జ్యోతిష్యుడు చెప్పిన విధంగానే సమంత పెళ్లి?

ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని(Prashanth Kini) గతంలో సమంత రెండో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన గతంలో సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ 2024లో సమంత ప్రేమలో పడుతుందని, 2025లో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. అలాగే 2026వ సంవత్సరంలో సమంత తన భర్తతో కలిసి యుఎస్ వెళ్లి అక్కడే సెటిల్ అవుతుందని ఇక ఈమె రెండవ పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉంటుందని ఈయన 2023 జూన్ 27వ తేదీ సమంత రెండో పెళ్లి గురించి పోస్ట్ చేశారు.

అమెరికాలో సెటిల్ కానున్న సమంత?

Advertisement

ఇక ఈయన చెప్పిన ప్రకారమే సమంత రెండో సారీ ప్రేమ వివాహం చేసుకోవడంతో తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ కిని మరోసారి స్పందిస్తూ సమంత పెళ్లి విషయంలో నేను చెప్పిన జ్యోతిషమే నిజమైంది అంటూ మరో పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత 2026వ సంవత్సరంలో యూఎస్ వెళ్లి సెటిల్ అవుతుందని చెప్పడంతో ఇకపై సమంత సినిమాలలో నటించదా? అంటూ మరికొంతమంది సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇలా సమంత రెండో పెళ్లి చేసుకున్న వెంటనే జ్యోతిష్యులు అందరూ కూడా వారిద్దరి జాతకం గురించి మాట్లాడటంతో ఎంతో మంది అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో కూడా సమంత నాగచైతన్య పెళ్లిని ప్రకటించడంతో వేణు స్వామి వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతారని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోగా సమంత డైరెక్టర్ రాజ్ ను వివాహం చేసుకున్నారు. సమంత రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో సమంత పెళ్లితో పాటు నాగచైతన్య రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి.

Also Read: Samantha Raj Nidimoru engagment happend in February photo goes viral (Image Source: Insta gram)

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×