E-Paper
Advertisement

Weather Update: ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం, మరోవైపు చలి.. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం..

Weather Update: ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం, మరోవైపు చలి.. తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం..
Advertisement

Weather Update: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలి బలహీనపడింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇవాళ దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

మరో మూడు రోజులు వర్షాలే.. వర్షాలు..
అలాగే నేడు మరో మూడు రోజులు పాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణశాఖ అంచనా వేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో స్కూల్లకు సెలవు కూడా ప్రకటించారు. మరో వైపు, తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచారు.

Also Read: అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. లక్షల్లో ఆస్తి నష్టం!

Advertisement

తెలంగాణను వణికిస్తున్న చలి..
రాష్ట్ర వ్యాప్తంగా చలి వణికిస్తోంది.తెలంగాణలో సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే. ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ఉదయం పొలం పనులకు వెళ్లే రైతులు.. విధులకు వెళ్లే ఉద్యోగులు, విద్యాలయాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు, మిగతా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×