E-Paper
Advertisement

డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?

డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?
Advertisement

Sonali kulkarni:చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఒక్కొక్కరిగా మీడియా ముందు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది నేరుగా ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తూ తమను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు బయట పెడితే.. మరి కొంత మంది పేర్లు ప్రస్తావించకుండా తాము ఎదుర్కొన్న సమస్యల గురించి అభిమానులతో ప్రస్తావిస్తున్నారు. అలాంటివారిలో సోనాలి కులకర్ణి కూడా ఒకరు. బాలీవుడ్ బ్యూటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె అక్కడి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటిస్తూనే.. తల్లి క్యారెక్టర్లతో కూడా మెప్పించింది. అలాంటి ఈమె తాజాగా నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ సినిమాలో నానికి తల్లిగా.. సమ్మక్క పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

చీరకట్టుకొని గదిలోకి రమ్మన్నాడు..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ది ప్యారడైజ్ సినిమా కంటే ముందే 24 ఏళ్ల క్రితమే నాగార్జునతో హిందీలో అగ్నివర్ష్ చిత్రంలో కలిసి కనిపించింది సోనాలి కులకర్ణి. ఇప్పుడు ది ప్యారడైజ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరియర్ తొలినాళ్లల్లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది.. ఒక డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడడానికి గదికి రమ్మన్నాడు. ఆ సమయంలో నాకు పెద్దగా అర్థం కాలేదు. పైగా నన్ను చీర కట్టుకోవాలని, ఒంటరిగానే రావాలి అని, తన సెక్రటరీ తో నాకు కబురు పంపాడు.

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు..

Advertisement

పైగా ఒక నిర్మానుష్య ప్రాంతంలోని ఒక ఇంటికి పిలిచాడు. స్టోరీ గురించి మాట్లాడుదామని పిలిచిన ఆ డైరెక్టర్.. నన్ను గదిలోకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళగానే కేవలం ఒక బెడ్ మాత్రమే ఉంది. ఏదో తేడా జరుగుతోందని అనిపించి, వెంటనే అప్రమత్తమై మళ్ళీ కలుస్తానని బయటకు వచ్చేసాను. అయితే ఆ డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అంటూ సోనాలి కులకర్ణి కామెంట్లు చేసింది. అయితే అతడు ఎవరు? అనే విషయంపై మాత్రం ఆమె స్పందించలేదు. మొత్తానికైతే ఇండస్ట్రీలో ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఆడవారిని ఇబ్బంది పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

also read:షాలిని చెల్లా.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి రోహిత్?

సోనాలి కులకర్ణి కెరియర్.

Advertisement

సోనాలి కులకర్ణి విషయానికి వస్తే.. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన ఈమె.. నటనపై ఆసక్తితో సత్యదేవ్ దూబే వర్క్ షాప్ లో నటన నేర్చుకుంది. 18 ఏళ్ల ప్రాయంలోనే 1992లో చెలువి అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత మరాఠీలో కూడా సినిమాలు చేసింది. ఇకపోతే ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె.. కెరియర్ ను మలుపు తిప్పింది మాత్రం హృతిక్ రోషన్ సరసన నటించిన మిషన్ కశ్మీర్. 26 ఏళ్ల వయసులోనే హృతిక్ రోషన్ కి తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈమె తల్లిగా నటించిన సరే.. హీరోయిన్గా ఆఫర్లు తలుపుతట్టాయి. అలా హీరోయిన్ గా నటిస్తూనే.. తల్లి పాత్రలతో కూడా షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 34 ఏళ్లకు పైగా సినీ కెరియర్లో కొనసాగుతున్న ఈమె తెలుగు, తమిళ్ , హిందీ, మరాఠీ భాషల్లో 70కి పైగా చిత్రాలలో నటించింది. అద్భుతమైన నటనకు 2002లో ఈమె నటించిన మరాఠీ షార్ట్ ఫిలిం చైత్ర కి ఏకంగా నేషనల్ అవార్డు లభించింది. అలాగే 86వ అకాడమీ అవార్డులకు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీ సాధించింది.

Related News

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

కావ్యతో అనిరుద్ పెళ్ళి…కట్నం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

చిరంజీవి కాకా మూవీ నుండి సీన్ లీక్.. ఊరమాస్ గెటప్ లో అదుర్స్!

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×